పెన్షన్ లబ్ధిదారులకు నొటీసులిచ్చిన ప్రభుత్వ వైఖరిపై పెందుర్తి జనసేన నిరసన

పెందుర్తి నియోజకవర్గం, వేపగుంట, 94వ వార్డు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాష్ట్రంలో అనర్హత వేటుతో 4 లక్షల మంది పేద పెన్షన్ దారులకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ పెందుర్తి జనసేన ఆద్వర్యంలో బాధితుల తరఫున జోన్ 8 జీవీఎంసీ ఆఫీస్ వద్ద నిరసన చేసి, సూపర్డెంట్ ను కలిసి బాధితుల సమస్యలు వివరించి లిఖితపూర్వకంగా వెంటనే వీరికి జనవరి నెలలో పెన్షన్ ఇవ్వాలని స్థానిక నాయకులు వీరమహిళ పిన్నటి పార్వతి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా మీడియా ప్రతినిధులతో పార్వతి మాట్లాడుతూ నోటీసులు తీసుకున్న పేద ప్రజలు గత కొన్ని సంవత్సరాల నుంచి పెన్షన్లు తీసుకుంటున్నారని, వారు ఆప్పుడు ఏ గృహంలో ఉన్నారో ఇప్పుడు అదే గృహంలో ఉన్నారని మరి అలాంటప్పుడు మీకు పెన్షన్ తొలగించే హక్కు ఎవరు ఇచ్చారని, పేద ప్రజలను వృద్ధులను, దివ్యాంగులను ఈ విధంగా రోడ్డుమీదకు తీసుకొని రావడం ఎంతవరకు సమంజసం అని, సుపరిపాలన చేయమని అధికారం ఇస్తే చెత్త పాలనతో ప్రజలను ఇబ్బంది పెట్టడం వలన మీకు రాబోయే రోజుల్లో ఓటు రూపంలో ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని మాట్లాడడం జరిగింది, నాయకులు వబ్బిన జనార్థన శ్రీకాంత్ మాట్లాడుతూ అధికారం రాకముందు రోడ్లమీద తిరిగి ఈ యొక్క పేద ప్రజలను ముద్దులు పెట్టి నేడు పెన్షన్లు తీసివేసి మొట్టికాయలు వేస్తున్నావని, రాజన్న పాలన చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి ఈనాడు రాక్షకపాలన చేస్తున్నావని, మా యొక్క పెందుర్తి నియోజకవర్గంలో వేల సంఖ్యలో ప్రజలకు నోటీసులు అందాయని వారికి వచ్చే జనవరి నెలలో పెన్షన్ ఇవ్వలేని ఎడల స్థానిక ఎమ్మెల్యే అన్నపురెడ్డి అదీప్ రాజు బాధ్యత వహించవలసిన అవసరం ఉందని, మా జనసేన పార్టీ ద్వారా బాధిత కుటుంబాలందరినీ ఏకం చేసి, జనసేన పార్టీ ఆధ్వర్యంలో మీ యొక్క ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నాము. స్థానిక నాయకులు జుత్తడ శ్రీనివాసరావు మాట్లాడుతూ పెన్షన్ 250 రూపాయలు పెంచడం కోసం నేడు ముఖ్యమంత్రి గారు 4 లక్షల మంది పెన్షనర్లకు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మిమ్మల్ని ఎవరు పెంచమన్నారు, ఎవరు తీయమన్నారు దీనికి మీరు బదులు ఇవ్వవలసిన అవసరం ఉందని, తప్పకుండా రాబోయే రోజుల్లో ప్రజలు తాలూకు వ్యతిరేకత మీకు తెలుస్తుంది అని మాట్లాడడం జరిగింది, నాయకులు శేఖర్ మాట్లాడుతూ చిన్న చిన్న కారణాలతో పెన్షన్ దారులకు నోటీసులు ఇవ్వడం వల్ల వారు ఆందోళన చెందుతున్నారని, బాధితు కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని మాట్లాడింది, స్థానిక యువ నాయకుడు లక్కీ గోవింద్ మాట్లాడుతూ 94 వార్డ్ లో 240 పేద ప్రజలు నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఈ ముఖ్యమంత్రి 4 కోట్లతో పుట్టినరోజు చేసుకోవడానికి పేద ప్రజల పెన్షన్ ఆపడం ఎంతవరకు సమంజసం అని, రాబోయే రోజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని మాట్లాడడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక నాయకులు మొటురు చైతన్య, శేఖర్, ప్రవీణ్, మరియు బాధిత ప్రజలు జనసైనికులు పాల్గొన్నారు.