కంచ కోడూరులో జనసేన జనబాట

పెడన నియోజకవర్గం, గూడూరు మండలం కంచ కోడూరు గ్రామంలో జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు గ్రామస్తులతో కలిసి జనబాట నిర్వహించారు. జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ విధివిధానాలను ప్రతి వ్యక్తికి తెలియజేయాలనె ఉద్దేశంతో గడపగడపకు తిరుగుతూ జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు ఘనంగా జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. కంచ కోడూరు జనసైనికులు ప్రతి ఇంటికి జనసేన పార్టీ 2023 నూతన సంవత్సర క్యాలెండర్ అందజేశారు. జనసేన పార్టీ నాయకులు కంచ కోడూరు గ్రామంలో ఉన్న ప్రజా సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా డ్రైనేజీ సమస్య, రైతు సమస్యలను గ్రామ ప్రజలు జనసేన పార్టీ నాయకుల దృష్టికి తీసుకువచ్చారు. గ్రామాల్లో ఉన్న పాఠశాల లో వర్షం వచ్చినప్పుడు నీరు నిలవడం వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారని తెలియజేయడం జరిగింది. కంచ కోడూరు దళిత గూడెంలో పాఠశాల పునర్నిర్మాణం కోసం, ఉన్న పాఠశాలను కూల్చివేయడం జరిగింది. కానీ సంవత్సర కాలం గడిచిన ఇప్పటివరకు పాఠశాల నిర్మాణ పనులను చేపట్టలేదు. పక్కనే ఉన్న ఓ ఇంటిలో ప్రస్తుతం పాఠశాల నిర్వహిస్తున్నారు. ఒకే చోట ఎక్కువమంది విద్యార్థులను కూర్చోబెట్టడం వల్ల విద్యార్థులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పాఠశాల భవనాన్ని త్వరగా నిర్మించవలసిందిగా జనసేన పార్టీ నుండి విజ్ఞప్తి. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు బత్తిన హరి రామ్, ఎస్ వి బాబు, శ్రీరం సంతోష్, కనపర్తి వెంకన్న, గరికపాటి ప్రసాద్, గల్లా హరీష్, సమ్మెట గణపతి, సమ్మెట చిన్ని, ముదినేని రామకృష్ణ,చీర్ల నవీన్ కృష్ణ, పాశం నాగమల్లేశ్వరరావు, భూమిరెడ్డి భగవాన్, దాసరి నాని, మారిబోయిన సుబ్బు, మారుబోయిన ఆదిత్య, గుడివాడ రాజా, వెంకటేశ్వరరావు, ఘంటా రవి కుమార్, కొల్లా శ్రీనివాస్, శాంతి గణేష్, తేజ, ధాతు, బొర్రా అంకల్, గాదె నరేష్, ఉడుముల ప్రతాప్, మున్నా మరియు కంచ కోడూరు గ్రామస్తులు, పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.