పోలింగ్ బూతుల ఆల్ పార్టీ మీటింగ్ లో జనసేన రెప్రజెంటేషన్

చంద్రగిరి, ఎన్నికల నియమావళి ప్రకారం పోలింగ్ బూతుల బైఫర్కేషన్ లేక మెర్జింగ్ ప్రక్రియలో భాగంగా తిరుపతి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లోని 2,112 పోలింగ్ బూతుల మార్పులు – చేర్పుల ప్రక్రియలో జనసేన పార్టీ తరఫున ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి దాదాపు 2,112 పోలింగ్ బూత్ లలో విధివిధానాలపై తిరుపతి కలెక్టరు వెంకటరమణ రెడ్డి చేపట్టిన ఆల్పార్టీమీటింగ్ లో జనసేన పార్టీని రెప్రజెంట్ చేస్తూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో చంద్రగిరి నియోజకవర్గం తరఫున దాదాపు 29 పోలింగ్ బూతుల్లో జనసేన పార్టీ సానుభూతి పరులుగా ఉన్నటువంటి వారిని ప్రస్తుత అధికార పార్టీ నాయకులు చాలా దూర ప్రాంతాల్లో ఉన్న పోలింగ్ బూత్ లో వారి ఓటును చేర్చారు. ఈ రెండు విషయాల మీద ఆల్ పార్టీ మీటింగ్ లో జనసేన పార్టీ తరఫున మాట్లాడటం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతోపాటు వివిధ పార్టీ నాయకులు మరియు ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు జనసేన పార్టీ సీనియర్ నాయకులు చింతకాయల కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, రామచంద్రపురం మండల అధ్యక్షుడు సింజీవి హరి, చంద్రగిరి నియోజకవర్గ యువ నాయకుడు యువి రాయల్ పాల్గొన్నారు.