ప్రజా సమస్యలపై జనసేన పోరుబాట పాదయాత్ర

ఏలూరు, ప్రజా సమస్యలపై జనసేన పోరుబాటలో భాగంగా గురువారం ఏలూరు నియోజకవర్గంలోని 13, 15 వ డివిజన్లోని జలాపహరేశ్వర కాలనీ, ప్రశాంత్ నగర్ ఏరియాలో రెడ్డి అప్పల నాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఈ డివిజన్లో చాలా తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. ప్రధానంగా డ్రైనేజీ సమస్య రోడ్డు సమస్య, అలాగే మంచినీటి సౌకర్యం లేదు. ఈరోజున ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ఉపాధిని కోల్పోయామని కరెంట్ బిల్ చూస్తే తీవ్ర స్థాయిలో ఉన్నాయని అన్నారు. ఇంటి పన్నుల సమస్య అనేది చాలా తీవ్రంగా ఉంది. ఇది కాకుండా అనేక రకాలుగా పన్నులు వసూలు చేస్తున్నారు. అన్ని రకాల పన్నుల భారాలతో ప్రజల్ని పీడిస్తున్నారు. ప్రజలంతా తీవ్ర మనోవేదనతో ఉన్నారు. ఇది చాలదన్నట్లుగా జగనన్న నువ్వే మా భవిష్యత్తు అనే స్టిక్కర్ మా ఇంటి ముందు బలవంతంగా అతికిస్తున్నారు స్టిక్కర్లను ఎవరైనా పీకితే సంక్షేమ పథకాలు తొలగిస్తామని బెదిరిస్తున్నారు. అన్ని రకాలుగా ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలను వంచనకు గురిచేస్తుంది. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పే రోజులు అతి దగ్గరలోనే ఉందని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఎప్పుడు ఎలక్షన్ వస్తాయో అని ఎప్పుడు ఈ జగన్ బాబుని ఇంటికి పంపిస్తామని ఆలోచనతో ప్రజలు ఉన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పెంచిన ఆ పన్నులను తక్షణమే రద్దు చేయాలని అదేవిధంగా చెత్త పన్నుని రద్దు చేయాలని ఏలూరు జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం. సామాన్యులు ఉండే పరిస్థితి లేదని అన్నారు. అదేవిధంగా 15% పెంచిన ఇంటి పన్నును రద్దు చేయాలి. నిత్యవసర ధరలు నియంత్రించాలి. ఇప్పటికైనా ఈ దుర్మార్గపు ఆలోచనలను మానుకోవాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మూడు దఫాలుగా లోకల్ ఎమ్మెల్యే ఆళ్ల నాని నీ మేము మూడుసార్లు గెలిపించాము. మాకు పన్నులు పీకేసిన ఎవరు పలకరించే నాధుడు లేరని గెలిచిన ఎమ్మెల్యే ఆ ఆలోచన చేయడం లేదని మూడుసార్లు మూడుసార్లు మేము గెలిపించుకున్న ఈ ఆళ్ళనాన్ని ఏలూరుకి అవసరం లేదని అభివృద్ధి గాని సంక్షేమంగానే అందరికీ అందుబాటులో లేనటువంటి ఈ ఎమ్మెల్యే మాకు అవసరం లేదని ప్రజల నుండి బలంగా వినిపిస్తున్నాయి. మరి భవిష్యత్తులో పవన్ అన్న రావాలి జగన్ పోవాలి అనే నినాదంతో ఈరోజున ప్రజలు ఉన్నారని ఎదురుచూస్తున్నారని తెలియజేస్తున్నామన్నారు. ప్రజలు ఎలా ఉన్నారంటే రాజకీయ నాయకుల్ని దొంగగా పారిపోయే వాళ్లుగా దోపిడిదారులుగా చిత్రీకరించే పరిస్థితికి ఈ ప్రభుత్వం తీసుకువచ్చిందని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజల మనోభావాలను ఈ ప్రభుత్వం దెబ్బతీశారని, ఒక వైపున భారీ వర్షానికి రైతులు తాను పండించిన పంటను నష్టపోతున్నారు. అధికారంలో ఉన్న ఈ ముఖ్యమంత్రికి స్థానిక ఎమ్మెల్యేకి ఇవి కనిపించడం లేదా అని ప్రశ్నించారు? ఇప్పటికైనా ఈ విధానాలను మార్చుకోవాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అలాగే టిడ్కో ఇళ్ళను అర్హులైన పేద ప్రజలకు లబ్ధిదారులకు వెంటనే ఇవ్వవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, ప్రధాన కార్యదర్శి కావూరి వాణిశ్రీ, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కోశాధికారి పైడి లక్ష్మణరావు, కార్యదర్శి కుర్మా సరళ, కందుకూరి ఈశ్వరరావు, ఎట్రించి ధర్మేంద్ర, బొత్స మధు, నాయకులు వీరంకి పండు, రెడ్డి గౌరీ శంకర్, అరిగెల సత్యనారాయణ, జంగం కృపానందం, నిమ్మల శ్రీనివాసరావు, బోండా రాము నాయుడు, అగ్గాల శ్రీనివాస్, బాబు, పవన్, 1 టౌన్ మహిళ ప్రెసిడెంట్ కోలా సుజాత, 2 టౌన్ మహిళ సెక్రటరీ తుమ్మపాల ఉమాదుర్గ, దుర్గా బీబీ, ప్రమీల రాణి స్థానిక డివిజన్ నాయకులు హరీష్, ఏడుకొండలు, పారిపల్లి శ్రీధర్, గంజి అప్పారావు, సేనాపతి ఈశ్వరరావు, అక్కిరెడ్డి రాజా మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.