తిరుపతిలో న్యాయవాదుల నిరసనకు జనసేన మద్దతు

తిరుపతి: కోర్టు ఆవరణలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్” పై న్యాయవాదులు చేస్తున్న న్యాయమైన “నిరసనకు మద్దతుగా బుధవారం జనసేన పార్టీ” వారికి సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, బాబ్జి, హేమ కుమార్, రాజేష్ ఆచారి, గుట్టా నాగరాజు, మనోజ్, కిషోర్, వంశీ, పురుషోత్తం, పురుషోత్తం రాయల్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా రాజారెడ్డి ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ అధికార పార్టీ ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, ప్రజల ఆస్తిపై పెత్తనం చెయ్యడం ఏంటని.. ప్రజల కోసం నిలబడ్డా న్యాయవాదులకు జనసేన అండగా నిలుస్తుందని వారు హామీ ఇచ్చారు.