టీడీపీ రిలే నిరాహార దీక్షకు జనసేన సంఘీభావం

కాకినాడ రూరల్ నియోజవర్గం: జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పిలుపు మేరకు కాకినాడ రూరల్ మండలం, వలసపాకల గ్రామంలో టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టులను ఖండిస్తూ స్థానిక టీడీపీ నాయకులు పిల్లి సత్తిబాబు ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు కాకినాడ రూరల్ మండలం జనసేన నాయకులు, జనసైనికులతో కలిసి మద్దతు తెలియచేసిన జనసేన పార్టీ కాకినాడ రూరల్ మండల అధ్యక్షులు కరెడ్ల గోవింద్. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల, గ్రామ, అర్బన్ నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.