ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు అండగా జనసేనాని

  • రాష్ట్రవ్యాప్తంగా 3000 మంది కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలు సహాయం చేసిన జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్

అల్లూరి సీతారామరాజు జిల్లా ఆరకు నియోజకవర్గం ఆరకు వేలి మండలంలో శనివారం గోడ పత్రికలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భముగా ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు మాట్లాడుతూ ముందుగా గోడ పత్రికలు విడుదల చేసి రాష్ట్ర వ్యాప్తంగా 3000 వెల మంది కౌలు రైతులకు జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సొంత నిధులు 30 కోట్లు రూపాయలు సహాయం చేసారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు ఒక కుటుంబానికి లక్షరూపాయలు చొప్పున ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 3000 వెల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు మొదటి విడత 30 మంది ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు కుటుంబానికి లక్షరూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది. రెండో విడత 41 కుటుంబాలకు ఇవ్వడం జరిగింది. మూడో విడత 128 మందికి లక్ష రూపాయలు చెక్కు అందజేసిన జనసేనపార్టీ అధినేత పవన్ కళ్యాణ్. ఇంత గొప్పగా సహాయం చేస్తుంటే రైతులకు అండగా నిలబడుతుంటే ఏదో నేరం చేసి నట్టు అడుగు అడుగున అడ్డుకుంటున్నారు మంత్రులతో దాడి చేయించిన మాత్రాన జనసేన రైతు భరోసా యాత్ర ఆగదు 3000 మందికి పూర్తి సహాయం అందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు వర్కింగ్ కమిటీ సభ్యులు కొనెడి లక్ష్మణ్ రావు శ్రీనివాసరెడ్డి బంగారు రామదాసు చినబాబు సంతోష్ సింగ్ సాయిబాబా రామకృష్ణ వీరమహిళలు మాలతి అనిత పవన్ బాలేష్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.