గురజాలలో జనసేన-టిడిపి డిజిటల్ క్యాంపెయిన్

గురజాల, రాష్ట్రవ్యాప్తంగా జనసేన-టిడిపి పిలుపుమేరకు, ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సూచనల మేరకు జనసేన, టిడిపి సంయుక్త ఆధ్వర్యంలో గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది కార్యక్రమంలో భాగంగా పిడుగురాళ్ల జానపాడు రోడ్ లోని ఆక్స్ఫర్డ్ వద్ద, గుంతలు పడ్డ రోడ్ల వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన, టిడిపి, నాయకులు మాట్లాడుతూ నేడు ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు ఎక్కడ ఉన్నాయో వెతుక్కునే పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని, పక్క రాష్ట్ర సీఎంలు సైతం ఆంధ్రప్రదేశ్ రోడ్ల గురించి కామెంట్ చేయటం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పని తీరును గుర్తు చేస్తుందని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలు వైసీపీకి తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పడానికి రెడీగా ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.