మెగా డీఎస్సీ కాదు దగా డిఎస్సి

  • నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిన జగన్ రెడ్డి
  • నిరుద్యోగ యువతకు జనసేన టీడీపీ ప్రభుత్వ స్తాపనతో సంపూర్ణ న్యాయం
  • జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో-ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత

అనంతపురం: జనసేన పార్టీ రాయలసీమ రీజినల్ ఉమెన్ కో ఆర్డినేటర్ పెండ్యాల శ్రీలత శనివారం మహిళలతో మాటామంతి కార్యక్రమంలో భాగంగా 20వ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలోని స్థానిక 9వ డివిజన్ భవాని నగర్ నందు పర్యటించి మహిళలతో మమేకమై స్థానిక సమస్యలు గుర్తించారు. ఈ సందర్భంగా ఆమె దృష్టికి వచ్చిన ప్రధాన సమస్య అయిన జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సీ గురించి ఆమె మాట్లాడుతూ మేము ఏ ఇంటికి వెళ్లిన జగన్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయిన నిరుద్యోగ యువతే మా కంట తారస పడుతున్నారని, జగన్ రెడ్డి 2019 ఎన్నికలకు ముందు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని మెగా డిఎస్సీ వదిలి 50వేళ టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పి నిరుద్యోగ యువతకు నమ్మించి అందలం ఎక్కాడని తీరా చూస్తే అధికారంలోకి వచ్చి దాదాపు 5సంవత్సారాలు పూర్తి కావస్తున్నా ఒక్క జాబ్ క్యాలెండర్ కూడా వదలకుండా ఇప్పుడు ఎన్నికళముందు నిరుద్యోగుల యువతను మరొక్కసారి మోసం చేయడానికి మెగా డిఎస్సీ అని కొత్త నాటకానికి తెరదింపుతు రాష్ర్టంలో 50వేళ ఉపాధ్యాయ పోస్టులు బర్తిగా ఉంటే గడిచిన నాలుగు సంవత్సరాలు నోటిఫి కేషన్ ఇవ్వకుండా ఇప్పుడు కేవలం 6100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తూ మోగా డిఎస్సీ అని కొత్తనాటకం ఆడుతున్నారని, ఇది మెగా డిఎస్సీ కాదు దగా డీఎస్సీ అని దానితో పాటు గత ప్రభుత్వాలు అప్రెంటిస్ విధానాన్ని రద్దు చేయగా ఈ ప్రభుత్వం తిరిగి మళ్లీ అప్రెంటిస్ విధానాన్ని తీసుకొస్తుందని ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని ఆమె హెచ్చరించి నిరుద్యోగ యువతకు జనసేన టీడీపీ పార్టీలు అండగా ఉంటాయని కచ్చితంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయ పోస్టులతో పాటు ప్రభుత్వ రంగంలో ఉన్న అన్ని రకాల పోస్టులను భర్తీ చేస్తామని, నిరుద్యోగ యువత తప్పకుండా జనసేన టీడీపీ పార్టీలకు అండగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి పెండ్యాల చక్రపాణి స్థానిక డివిజన్ నాయకులు సాయి, హర్షద్, వీరమహిళలు కళ్యాణి, సుమలత, శైలజ, గురులక్ష్మి, శశికళ, సానియా, గాయత్రి తదితరులు పాల్గొనడం జరిగింది.