తెలంగాణ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయనున్న జనసేన

  • జనసేన పార్టీ శ్రేణుల సమక్షంలో వెల్లడించిన జనసేన ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి

తెలంగాణ, హైదరాబాద్, జూబిలీహిల్స్ ప్రశాశన్ నగర్లో గల జనసేన పార్టీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షులు బొంగునూరి మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్, రాష్ట్ర నాయకులు తాళ్లూరి రామ్, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రాధారం రాజలింగం, గ్రేటర్ హైదరాబాద్ ఉపాధ్యక్షులు దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉపాద్యల్షులు మీడియా ముఖంగా మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డపై పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, గత ఎన్నికల్లో 7 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసిందని ఈసారి రానున్న ఎన్నికల్లో దాదాపు 32 అసెంబ్లీ స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేయనుందని మీడియా, రాష్ట్ర నాయకులు , జనసైనికులు, వీర మహిళల సమక్షంలో వెల్లడించడం జరిగింది. పార్టీ క్యాడర్ బలంగా ఉన్న 32 నియోజకవర్గాల్లో ఇప్పటికే కమిటీలు వేశాం, అక్కడ పార్టీ బలంగా పనిచేస్తుంది. మా అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పోటీ చేయడానికి నిర్ణయించామని జి.హెచ్.ఎం.సి పరిధిలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాల్లో ప్రధానంగా జనసేన పార్టీ పోటీ చేయనుందని, తెలంగాణ రాష్ట్రంలో పొత్తుల అంశంపై ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు, భవిష్యత్తులో రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా పవన్ కళ్యాణ్ సూచనల మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంటుందని, 32 నియోజకవర్గాల్లో పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తున్నాం, పార్టీ బలంగా ఉన్న స్థానాల్లో మా అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇక్కడ కూడా చేయనున్నారని తెలిపారు. యువతకు, మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీని పవన్ కళ్యాణ్ స్థాపించారని ఇందులో భాగంగా ఇప్పటికే నాయకత్వాన్ని తయారు చేశామని, దాదాపు 25 స్థానాల్లో పార్టీకి బలమైన ఓటు బ్యాంక్ ఉందని, గెలుపోటములు నిర్ణయించే స్థాయిలో మా ఓటింగ్ ఉందని గత ఎన్నికల్లో మల్కాజ్ గిరి పార్లమెంట్ ఎన్నిక దానికి ఉదాహరణ అని అన్నారు. అదేవిధంగా తెలంగాణలో బలంగా పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ సానుభూతిపరులు, మెగా అభిమానులు పార్టీకి అండగా నిలబడ్డారని, గత 10 సంవత్సరాల్లో అనేక సమస్యలపై తెలంగాణలో జనసేన పార్టీ పోరాటం చేసింది. నల్లమల యురేనియం త్రవ్వకాలు, మహిళలపై దాడులు, డ్రగ్స్ సమస్య, ఆర్టీసి కార్మికుల సమస్య, బిసి, ఎస్టి వర్గాల సమస్యలు, విద్యార్థుల సమస్యలు ఇలా అనేక సమస్యలపై పోరాటం చేశామని గుర్తుచేసారు.

Image