కడియడ్డ గ్రామంలో ఘనంగా జనసేన పల్లెపోరు

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: తాడేపల్లిగూడెం మండలం, కడియడ్డ గ్రామ పల్లెపోరులో బాగంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపే రోజులు దగ్గరకు వస్తున్నాయని అది మీ గ్రామ ప్రజల చేతుల్లోనే ఉందని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు గడుస్తున్న ఒక డ్రైనేజీ వ్యవస్థ గాని ఒక రోడ్ల వ్యవస్థ గాని ఒక మంచి నీటి వ్యవస్థ గాని ఏది బాగుపడలేదని అంతేకాకుండా రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులైపాడుతుందని అమాయక ప్రజల ప్రాణాలతో మీ రాక్షస ఆటలు ఇక సాగవని, మద్యం షాపుల్లో డిజిటల్ లావదేవీలు జరగకుండా అవినీతి సొమ్ము మొత్తం ప్యాలస్ తరలింపు నిజం కాదంటారా అని బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపా ప్రసాద్, మరియు కడియడ్డ జనసేన నాయకులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు.