గిరిజన ప్రజల్లో చైతన్యం కలిగించడమే జనసేన కర్తవ్యం: జాగరపు పవన్ కుమార్

పాడేరు: పెదబయలు మండలం, నిమ్మగుంట గ్రామంలో గిరిజన సాంప్రదాయ ఇటుకల పండగ సందర్బంగా వాలీబాల్ మెగాటోర్నీ నిర్వహించడం జరిగింది. గ్రామస్తుల ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా హాజరైన పెదబయలు మండల జనసేన పార్టీ అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ మరియు మండల స్థాయి నాయకులకు నిమ్మగుంట గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్బంగా గ్రామస్తులతో మాట్లాడుతూ మన సాంప్రదాయ గిరిజన పండగల్లో మన సంస్కృతి ఆచార వ్యవహారాలు స్పష్టంగా కనిపిస్తోంది. మా వంతుగా జనసేన పార్టీని బలోపేతం చేస్తూ నిరంతరం ప్రజలకు పారదర్శక రాజకీయాలు గురించి చెప్తూ గిరిజన ప్రజల్లో చైతన్యం కలిగించడమే మా కర్తవ్యంగా భావిస్తాం. అవాంతరాలు రాని కానీ ఆశయంలో మార్పులేదు? మీ గ్రామస్తులు మాపై చూపిన అభిమానానికి మీకు కృతజ్ఞతలు. అలాగే రాష్ట్రక్షేమము కోరే గిరిజనులుగా మీరు చైతన్యం కావాలంటే మార్పుకోరుకునే రాజకీయాలు అవసరం అందుకు నిబద్ధత, నీతివంతమైన ఆలోచన విధానంతో జనసేన పార్టీ ఎప్పటికి ముందుంటుంది. ఇకపై ఈ గ్రామ ప్రజలు ప్రతి కష్టసుఖల్లోనూ మా భాగస్వామ్యం ఉంటుందని గ్రామస్తులకు తెలియజేసారు. ఈ సందర్బంగా వాలీబాల్ టోర్నీలో విజేతలకు ప్రధమ బహుమతి అందజేశారు. ఈ సందర్బంగా ఇటుకల పండుగ ఉత్సవాలకు జె. కళ్యాణ్, కె. చిన్నయ్య, పి. రాజు, కె అప్పారావు, బాబులు హాజరయ్యారు.