జోరుగా సాగుతున్న జనసేన జనజాగృతి యాత్ర..

  • ఉదయాన్నే 400 మంది మహాత్మా గాంధీ ఉపాధి హామీ రైతుకూలీలతో గురుదత్ ముఖాముఖి చర్చ

రాజానగరం నియోజకవర్గం: కోరుకొండ మండలం, కాపవరం గ్రామంలో జనసేన జన జాగృతి యాత్ర 82వ రోజు కార్యక్రమంలో భాగంగా ఉపాధిహామీ రైతుకూలీలు స్వయంగా పని చేసే చోటకి రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ & ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకునారు.
400 మంది ఉపాధిహామీ రైతు కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు అందజేసిన గురుదత్.. ఈ కార్యక్రమంలో కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, కోరుకొండ మండల జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు చదువు నాగేశ్వరరావు, కోరుకొండ మండల జనసేన పార్టీ నాయకులు తెలగంశెట్టి శివ, చదువు ముక్తేశ్వరరావు, గొల్లకోటి కృష్ణ, తన్నీరు తాతాజీ, కొచ్చర్ల బాబి, కాపవరం గ్రామ జనసేన పార్టీ నాయకులు ఆకుల ఆదిత్య, సోడసాని శివాజీ, సోడసాని పెద్దకాపు, గట్టి మణికంఠ, నాగేంద్ర, నరసింహ, శంకర్, సురేంద్ర మరియు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.