వైసీపీని గద్దె దించడమే జనసేన ముందున్న లక్ష్యం: సాకే మురళీకృష్ణ

సింగనమల: గార్లదీన్నే మండలం, మర్తాడు గ్రామంలో జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి దివే కృష్ణమూర్తి అధ్యక్షతన మండల కార్యకర్తల ఆత్మీయ సమావేశం ఘనంగా నిర్వహించడం జరిగింది. సమన్వయకర్త సాకే మురళీకృష్ణ మాట్లాడుతూ కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు జనసేన పార్టీలో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని, మండల వ్యాప్తంగా దాదాపుగా 200 మంది క్రియాశీలక సభ్యులు ఉన్నారని ప్రతి ఒక్కరూ రాబోయే ఎన్నికల్లో గ్రామ గ్రామాన కష్టపడి పని చేసే విధంగా ముందుకు సాగాలని వైసీపీ పాలన గద్దె దించడమే జనసేన ముఖ్య లక్ష్యం అని గ్రామస్థాయిలో జనసేన పార్టీ బలోపేతానికి కార్యకర్తలు మరింత బలంగా కష్టపడాలని పార్టీ ఎదుగుదలే ముఖ్యంగా కొనసాగాలని తెలియజేశారు. జిల్లా ఉపాధ్యక్షులు అంకె ఈశ్వరయ్య మాట్లాడుతూ.. సింగనమల నుండి జనసేన పోటీ చేయడానికి సిద్ధంగా ఉంది అని అన్నారు. జనసేన టిడిపి పార్టీలో ఉమ్మడి అభ్యర్థిని ఎవరిని ప్రకటించిన వారి కోసం కష్టపడి గెలుపే లక్ష్యంగా పనిచేయడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, నియోజకవర్గ మహిళా నేత శశిరేఖ గోగుల సునీత మండల ఉపాధ్యక్షులు సోమశేకర్ రాఘవేంద్ర జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.