యల్లటూరు శ్రీనివాస రాజు ఆధ్వర్యంలో జనంలో జనసేన

ఉమ్మడి కడప జిల్లా, రాజంపేట నియోజకవర్గం: రాజంపేట పట్టణంలో జనంలో జనసేన కార్యక్రమంలో భాగంగా సరస్వతీ పురం, కొలిమివీధి, బండ్రాళ్లవీధి, లలో జనసేన నాయకులు శింగంశెట్టి నరేంద్ర మరియు జనసైనికులు ఇంటింటికి ప్రచారం చేసి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, జనసేన పార్టీ సిద్దాంతాలను ఎన్నికల గుర్తు ” గాజు గ్లాస్ “ను వివరించి కరపత్రాలను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదురుకుంటున్న సమస్యలను సేకరించి రానున్న ఉమ్మడి ప్రభుత్వంలో జనసేన పార్టీ ద్వారా పరిష్కారం చూపుతామని జనసేన నాయకులు భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖ సీనియర్ రాజకీయ నాయకులు కె.ప్రభాకర్ రాజుగారిని వారి నివాసంలో కలవడం వారిని యల్లటూరు శ్రీనివాసరాజు గారికి మద్దతు ఇవ్వమని కోరడమైనది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ప్రభాకర్, పలుకూరి శంకర్, కె.ఆర్, కత్తిసుబ్బరాయుడు, వర్మ, హరి, చల్లాసుధ, సుబ్రహ్మణ్యం, కిష్టయ్య, అఫ్రోజ్, అబ్బిగారి గోపాల్, మౌల, భీమినేని రమేష్, శంకరరాజు, అన్నమయ్య, రఘు, కళ్యాణ్, రమేష్, దినేష్, మునిరాజ్, గాజుల శ్రీహరి, వీరమహిళలు శాంతకుమారి, కళావతి, సుప్రియ, అర్చన, విజయ, పద్మ, సుబ్బమ్న, జయ, శివపార్వతి, మీనాక్షి, సుబ్బలక్ష్మి, లక్ష్మీ దేవి, రత్నమ్మ, రామలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.