శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

కూకట్ పల్లి నియోజకవర్గం: కూకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ 120-డివిజన్ లో జనసేన పార్టీ రాష్ట్ర మరియు కూకట్పల్లి ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ ఆదివారం జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా బాలనగర్ లో గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఉదయం 10 గంటల నుండి జన శ్రేణులతో కలిసి బాలానగర్ విల్లగె, రాజు కాలనీ, శరబండ రాజు బస్తీ, సాయినగర్ గడిచెన్ను, వినాయక్ నగర్, గీత నగర్, నవజీవం నగర్,
గణేష్ నగర్, కళ్యాణి నగర్లలో పాదయాత్ర చేస్తూ జనసేన పార్టీ సిద్ధాంతాలను మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజలకు వివరిస్తూ డివిజన్లోని సమస్యలను కనుక్కున్నారు. ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. డివిజన్లో నాలాల వల్ల దుర్వాసన వస్తుందని, వాటి వల్ల తమ ఆరోగ్యం పాడవుతుందని, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదని, పాలకుల అనుచరులకే దళిత బంధు ఇచ్చుకుంటున్నారని, డబుల్ బెడ్ రూమ్ ఇంతవరకు తమ డివిజన్లో ఎవరికి రాలేదని తనకు విన్నవించుకున్నారని అన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మరియు కార్పొరేటర్ లే తమ జేబులు తమ హోదాను పెంచుకోవడానికి సరిపోతుంది కానీ ప్రజలను పట్టించుకోవట్లేదని, రాబోయే రోజుల్లో ప్రజలకు అండగా జనసేన పార్టీ ఉంటుందని ప్రజల యొక్క సమస్యలను నిస్వార్ధంగా తీరుస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమమునకు బాలానగర్ జనసేన పార్టీ నాయకులు గడ్డం నాగరాజ్ కిషోర్, దళిత నాయకుడు జెన్నీ సునీల్, చెను రవీంద్రనాథ్, నరేష్, వెంకట్రావు, గ్రేటర్ హైదరాబాద్ సెక్రటరీ మండలి దయాకర్ కోఆర్డినేటర్లు కొల్లా శంకర్, వేముల మహేష్, పోలిశెట్టి సునీంద్రబాబు, లక్ష్మణ్ రావు, వీరమహిళలు భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి, ముంతాజ్, వెంకటలక్ష్మి, స్వాతి రెడ్డి మరియు జనసైనికులు పాల్గొన్నారు.