యడమ రాజేష్ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన

పటాన్ చెరువు నియోజకవర్గం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల ముందుకు తీసుకొచ్చే విధంగా జనసేన పార్టీ పటాన్ చెరువు ఇంచార్జ్ యడమ రాజేష్ నాయకత్వంలో జనంలోకి జనసేన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా సోమవారం పటాన్ చెరువు నియోజకవర్గం, రామచంద్రపురం మండలంలోని 111- భారతీ నగర్ డివిజన్ మరియు 112-రామచంద్రపురం డివిజన్లో పాదయాత్ర కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంచార్జ్ రాజేష్ మాట్లాడుతూ.. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అవినీతి రాజకీయ నాయకులను గద్దె దించే ప్రక్రియలో జనసేన ప్రజలకు అండగా ఉంటుందని, బ్రష్టు పట్టిన రాజకీయాలను ప్రక్షాళన చేస్తూ నూతన రాజకీయ వ్యవస్థను స్థాపించి, ప్రజలకు సేవ చేయడంలో జనసేన పార్టీ ముందుంటుంది అని తెలపడం జరిగింది. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలతో ప్రజలకు చేరువలో జనసేన ఉంటుందని, ప్రజల గుండెల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు మరియు మెగా అభిమానులు భారీగా పాల్గొన్నారు.