వైసీపీ ప్రభుత్వం మరోసారి ఘోరంగా విఫలమైంది: వాసగిరి మణికంఠ

గుంతకల్, 22 మంది ఎంపీలు, 6 మంది రాజ్యసభ సభ్యులు మొత్తం కలిసి కేంద్ర బడ్జెట్లో ఏపీకి సాధించింది “సున్నా”. రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టులు, నిధులపై ఒత్తిడి తేవడంలో వైసీపీ ప్రభుత్వం అసమర్ధత బయటపడింది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇంత మంది ఎంపీలు ఇస్తే రాష్ట్రానికి ఏమి చేయగలరు కేంద్రం నుంచి రావాల్సినవి చాలా ఉన్న వాటిని రాబట్టుకోవడంలో వైసీపీ ప్రభుత్వం మరోసారి ఘోరంగా విఫలమైందని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ వ్యాఖ్యానించారు. ఉత్పాదక, వ్యవసాయ రంగాలను బలోపేతం చేయడం ద్వారా దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లే విధంగా కేంద్ర బడ్జెట్ ను బిజెపి ప్రభుత్వం రూపకల్పన చేయడం ఆశావాహ పరిణామం. అయితే ఈ బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన విభజన హామీలు, పోలవరం ప్రాజెక్టు వంటి అంశాలు చోటు చేసుకోకపోవడం కొంత నిరాశను కలిగించింది. ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలు కొత్తగా కల్పించాలని బడ్జెట్లో పేర్కొనడాన్ని మేము స్వాగతిస్తున్నాము. అదే విధంగా రాష్ట్రాలకు లక్ష కోట్ల రూపాయల నిధులతో నిధి, అదే విధంగా 50 ఏళ్ల వరకు వడ్డీ లేకుండా లక్ష కోట్ల రూపాయల రుణాన్ని రాష్ట్రాల తీసుకునే అవకాశం రాష్ట్రాలకు మేలు చేస్తుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలకు ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఆదాయపు పన్ను పరిమితి ఈసారి బడ్జెట్లో పెంచుతారని ఎదురుచూసిన ఉద్యోగులు నిరాశకు గురయ్యారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల అభివృద్దికి ప్రత్యేక కేటాయింపులు చేసుంటే బాగుండేదని జనసేన భావిస్తోందని అన్నారు.