కృష్ణాపురంలో జనసైనికుల పర్యటన

గుడ్లూరు: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా, కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి పులి మల్లికార్జున ఆదేశాలు మేరకు గుడ్లూరు మండల జనసైనికులు ప్రజాక్షేత్రంలోకి, జనంలోకి జనసేన అంటూ మండలంలోని నాయుడు పాలెం పంచాయతీ, కృష్ణాపురం గ్రామం, ఎస్.సి కాలనీలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా జనసైనికులు మాట్లడుతూ గ్రామాల్లో, పల్లెల్లో, కాలనీల్లో ఎక్కడ చూసినా.. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా సమస్యలు ఇబ్బడిముబ్బడిగా ఉన్నాయి. డ్రైనేజ్ సమస్యలు, పేదలకు పించన్లు, తాగు నీటి సదుపాయాలైన బావులు బోర్లు మరమ్మతులకు గురయితే వాటిని బాగు చేయలేకపోవడం వంటి చిన్నచిన్న మౌలిక సదుపాయాలు కూడా తీర్చలేని ప్రభుత్వం ఈ వైకాపా ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గారేమో బటన్ మాత్రం నొక్కుతారు. ఆ బటన్ నొక్కిన నిధులు అర్హులైన పేదలకు సంక్షేమ ఫలాలుగా ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఎస్.సి కాలనీలో ఒక మహిళ స్థానిక సమస్యలు ప్రస్తావిస్తూ ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎన్నికలు వచ్చినప్పుడల్లా రాజకీయ పార్టీ నాయకులు వస్తున్నారు, పోతున్నారు గానీ సమస్యలు మాత్రం అలానే ఉంటున్నాయి. మా కాలనీలో డ్రైనేజ్ సమస్యతో ఇరుగు పొరుగు మా సంబంధీకులతో గొడవలు, తగాదాలు జరుగుతూ మానసిక క్షోభకు గురి కావాల్సి వస్తుందని వాపోయారు. ఇదే అంశంపై ఉటంకిస్తూ, జనసైనికుడు అన్నంగి చలపతి మాట్లాడుతూ మండల కేంద్రమైన గుడ్లూరులో కూడా ఇటీవల ఇళ్ళ మద్య మురుగు నీరు అంశంగా రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగి ఒక వ్యక్తి చనిపోయాడు. ఇలాంటి ఘటనలు చూస్తూ కూడా అధికారపార్టీ నాయకులు, అధికార యంత్రాంగం మొద్దు నిద్ర పోతున్నారా అని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా అధికారులు, నాయకులు, సర్పంచ్ లు స్థానిక సమస్యలపై దృష్టి సారించి, వాటి పరిష్కారం చేయాలని లేదంటే జనసేన పార్టీ తరపున ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలు చేయాల్సి వస్తోంది అని గుర్తించారు. తదనంతరం జనసైనికుడు మూలగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలు, పార్టీ ఆవిర్భావం నుంచి ప్రజా సమస్యలు పట్ల ఆయన స్పందిస్తున్న తీరు, నాడు ఉద్దానం సమస్య, అమరావతి రైతుల భూసేకరణ సమస్య, ప్రత్యేక హోదా అంశంలో తనదైనశైలిలో తన గొంతుకను బలంగా వినిపించిన తీరు, తర్వాత నాటి టిడిపి పాలనలో ఇసుక, మైనింగ్, మద్యం మాఫియా, దోపిడీ విధానాలు గూర్చి తన గళాన్ని బలంగా వినిపించిన తీరు, తర్వాత వైకాపా ప్రభుత్వం వచ్చినాక ఇసుక, సిమెంట్ ధరలు విపరీతంగా పెంచి భవన కార్మికులకు ఉపాధి కొరత సృష్టించినప్పుడు రాజమండ్రిలో లాంగ్ మార్చ్, విశాఖ ఉక్కు ప్రవేటికరణ వ్యతిరేకిస్తూ వైజాగ్ భారీ బహిరంగ సభ, ప్రధానంగా చనిపోయిన కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక భరోసా ఇస్తూ కుటుంబానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సాయం, తాను పోటీ చేసిన రెండు చోట్ల ఓడినా కూడా అధికారమే పరమావధిగా కాకుండా ప్రజాసమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పని చేస్తూ, యువత, మహిళలు, ప్రజానీకంలో చైతన్యం గూర్చి పవన్ కల్యాణ్ గారు పాటుపడుతున్న తీరు ప్రతి ఒక్కరూ గమనించి ఆలోచించాలని ఉటంకించారు. రానున్న ఎన్నికల్లో మనం పులి మల్లికార్జున గారిని గెలిపించుకుని, తద్వారా ఎలాంటి రాజకీయ మచ్చలు లేని, నిజాయితీ పరుడు, నిత్యం ప్రజాక్షేమం కోసం పరితపించే పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇక్కడ మరొక ముఖ్య విషయం ఏమిటంటే “వీళ్ళా నాయకులు” అనే అంశంపై వైకాపా, టిడిపి వంటి అన్ని రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు అందరిలో చర్చ జరగాలి (ఇక్కడ చర్చ అంటే ఎవరో డిబేట్ పెడతారేమో అనుకోవద్దు. ఎవరికి వారు చింతన చేయడమే). ఏ అంశం మీద మనం చింతిస్తున్నాము, ఎందుకు అసభ్య పదజాలం వాడటం, వ్యంగమైన పోస్టింగ్స్, రెచ్చగొట్టే వ్యాఖ్యలు – ఇలాంటి చర్యలు వల్ల స్వతహాగా మనకు గానీ, మన కుటుంబాలకు గానీ, మన సమాజానికి గానీ లేదా మనం అభిమానించే పార్టీలకు గానీ ఏం ప్రయోజనమని ఆలోచించాలని జనసైనికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు మూలగిరి శ్రీనివాస్, అనిమిశెట్టి మాధవరావు, అన్నంగి చలపతి, అమోస్, రాంబాబు ఉలవపాడు మండలం నుంచి ప్రతాప్ మరియు స్థానిక యువత శ్యామ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.