నేతన్నలను ఆదుకోండి లేకుంటే ఉద్యమమే

పెడన నియోజకవర్గంలో వ్యవసాయ రంగం తర్వాత ఎక్కువగా ఆధారపడి జీవిస్తున్న రంగం చేనేత పరిశ్రమ మరియు కలంకారి. ప్రస్తుతం ఈ పరిశ్రమను నమ్ముకున్న నేతన్నలు పని లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

పెడన పట్నం పరిధిలో ఉన్న రామలక్ష్మి వీవర్స్ కాలనీ మరియు బ్రహ్మ పురంలోని సాయి విజయ గణపతి రివర్స్ కాలనీ లోని నేతన్నల స్థితిగతులను తెలుసుకొనుట కొరకు జనసేన నాయకులు పర్యటించడం జరిగింది. పర్యటనలో భాగంగా చేనేత కార్మికుల కష్ట నష్టాలను తెలుసుకోవడం జరిగింది.

చేనేత కార్మికులు పని లేక, చేసిన పనికి వేతనాలు రాక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక చేనేత పరిశ్రమ పూర్తిగా విస్మరించడం వల్ల ఈ పరిశ్రమను నమ్ముకున్న వేలాది మంది కార్మికుల జీవితాలు ప్రశ్నార్థకం అయ్యాయి.

మంత్రి జోగి రమేష్ ఆఫీసుకి కూతవేటు దూరంలో కార్మికులు ఇన్ని ఇబ్బందులు పడుతున్న పట్టించుకోకపోవడం మంత్రి నిర్లక్ష్య ధోరణికి నిదర్శనం. ప్రగల్భాలు పలకడం తప్ప.. పని చేయడం చేతకాని మంత్రి జోగి రమేష్.

నేతన్న నేస్తం ద్వారా నేతన్నలను దగా చేస్తున్నారు. గతంలో ట్రిప్ట్ ఫండ్, యన్నం (నూలు) సబ్సిడీ క్రింద ఒక్క కార్మికుడికి ఏడాదికి సుమారు 70 వేలు వచ్చేవి, కానీ వైసీపీ ప్రభుత్వం ఇరవై నాలుగు వేలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. అంతేకాక చేనేత పరిశ్రమకు ఆయువు పట్టు అయిన సహకార సంఘాలు నిర్వీర్యం అయ్యాయి. కార్మికులకు పని కల్పించే స్థితిలో లేవు. కృష్ణా జిల్లాలో 15 కోట్ల విలువగల వస్త్ర నిల్వలు సంఘాల దగ్గర ఉండటంవల్ల, కార్మికులకు మజురి వేతనాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయి. ప్రభుత్వం ఆలోచన విధానం మారాలి. క్షేత్రస్థాయిలో చేనేత సమస్యలు పరిష్కరించే మార్గాలను అన్వేషించాలి.

చేనేత మరియు జౌళి అధికారులు తక్షణమే స్పందించి కార్మికుల సమస్యల పరిష్కార మార్గం చూపించాలి లేనియెడల జనసేన పార్టీ కార్మికుల పక్షాన నిలబడి ఎంతటి పోరాటానికైనా సిద్ధం అని ఈ సందర్భంగా జనసేన నాయకులు తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు సమ్మెట, కూనసాని నాగబాబు, పండమనేని శ్రీనివాసరావు, గరికిపాటి ప్రసాద్, తిరుమలశెట్టి సుధీర్, పాశం నాగమల్లేశ్వరరావు, నవీన్ కృష్ణ, వెంకయ్య, ముచ్చర్ల సురేష్, బత్తిని నరేష్, కొప్పినెటి శివమణి, ముద్ధినెని రామకృష్ణ, దాసరి ఆదినారాయణ, పుప్పల సాయి, పినిశెట్టి రాజు మరియు పెద్ద ఎత్తున జనసైనికులు పాల్గొన్నారు.