విడివాడ ఆధ్వర్యంలో జనంలోకి జనసేన – జనంకోసం జనసేన

తణుకు నియోజకవర్గం, తణుకు పట్టణంలోని 34వ వార్డు నుండి తణుకు నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు ఆధ్వర్యంలో జనంలోకి జనసేన జనం కోసం జనసేన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, ఆశయాలను, రాష్ట్ర ప్రజలకు ఆయన చేసిన సేవలను తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాతో విడివాడ రామచంద్రరావు మాట్లాడుతూ.. గత రెండు రోజులుగా అధికార పార్టీ వారు పెట్టిన బ్యానర్స్ ని మంగళవారం మున్సిపాలిటీ వారు దగ్గరుండి తొలగించడం జరిగింది. దీనికి జనసేన పార్టీ తరఫున రూరల్ సిఐ, టౌన్ ఎస్ఐ మరియు మున్సిపల్ కమిషనర్ వారికి, మీడియా మిత్రులకు తణుకు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విడివాడ రామచంద్ర రావు కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాగే పేదలకు ఇచ్చిన ఇళ్ల స్థలాలను మీరు ఇల్లులు కట్టుకోకపోతే వెనక్కి తిరిగి తీసుకుంటామంటూ ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని రామచంద్రరావు తెలియజేచేశారు. ఈ కార్యక్రమంలో తణుకు పట్టణ అధ్యక్షులు కొమ్మిరెడ్డి శ్రీనివాస్, తణుకు టౌన్ యూత్ ప్రెసిడెంట్ గరే తులసీరామ్, తణుకు టౌన్ ప్రధాన కార్యదర్శి పంతం నానాజీ, ఇరగవరం మండల అధ్యక్షులు ఆకేటి కాశి, జిల్లా జాయింట్ సెక్రెటరీ తామవరపు చిన్న, మండపాక వైస్ ప్రెసిడెంట్ వట్టికూటి నగేష్, జవాది ప్రసాద్, కురసల శ్రీనివాస్, కేశవ, శివటం శ్రీను 34వ కార్యకర్తలు మొండి సుబ్బారావు, జామ్ శెట్టి సుబ్రహ్మణ్యం, మొలగల పెద్దిరాజు, కమవరుపు రూప, జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు, వీరమహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.