జనంతో జనసేన – ప్రజా బాటలో ప్రజల సమస్యలు తెలుసుకొంటున్న శివకోటి యాదవ్

తెలంగాణ, నర్సంపేట మండలం శివారు ప్రాంతంలో “జనంతో జనసేన – ప్రజా బాట” కార్యక్రమంలో భాగంగా జనం సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లిన జనసేన నియోజకవర్గం ఇంచార్జ్ మేరుగు శివకోటి యాదవ్ తో ఇంటి స్థలం లేక ఇల్లు లేక దాదాపు 8 సంవత్సరాల నుంచి నర్సంపేట ఊరు చివర ఉన్న ఖాళీ స్థలంలో ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని దాదాపు 200 వందల కుటుంబాలు జీవనం సాగిస్తున్నామని, మాకు ఇళ్ల స్థలానికి పట్టాలు ఇప్పిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి ఇప్పటివరకు వాటి ఊసే లేదు. నీటి సమస్యను, డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతూ, దోమల బెడదతో జ్వరాల బారిన పడుతున్నామని వారి బాధను తెలిపారు. ఈ సందర్భంగా శివకోటి యాదవ్ వారి యొక్క సమస్యలను వ్రాసుకొని, తెలంగాణ రాష్ట్ర జనసేన నాయకులకు, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లే విధంగా, వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో నర్సంపేట మండల అధ్యక్షుడు వంగ మధు, ప్రధాన కార్యదర్శి, ఓర్సు రాజేందర్, కార్యవర్గ సభ్యులు అందే రంజిత్, గంగుల రంజిత్, బొబ్బ పృథ్వీరాజ్, గద్దల కిరణ్, పోషాల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు.