రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో జనంతో “టీ” జనసేన

మదనపల్లె నియోజకవర్గం: బిటీ కాలేజీ హాకీ గ్రౌండ్ లో గంగారపు రాందాస్ చౌదరి ఆధ్వర్యంలో చేపట్టిన్ జనంతో “టీ” జనసేన కార్యక్రమంలో భాగంగా రాందాస్ చౌదరి మాట్లాడుతూ జనసేన నాయకులు, కార్యకర్తలతో కలిసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపు హలో ఏపీ బై బై వైసీపీ అనే నినాదాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోతు అలాగే జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తు ను రిజర్వు చేసినందుకు సంతోసిస్తూ.. గాజు గ్లాస్ గుర్తు ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము ఎవరైతే వాకింగ్, జాగింగ్, ఎడ్యుకేటెడ్, టీచర్స్, లెక్చరస్, అడ్వకేట్స్, డాక్టర్స్, చార్టెడ్ అకౌటెంట్స్, స్టూడెంట్స్ ఉంటారో అక్కడ ప్రతి ఆదివారం ఉదయం జనం కోసం జనసేన ప్రోగ్రాం చేస్తూ వారిని చైతన్య వంతులను చేసి, ఈ రాష్ట్రంలో వైసీపీ దిగిపోవాల్సిన ఆవశ్యకతను తెలియచేస్తూ, నీతి పరుడు తన సొంత డబ్బులను కౌలు రైతులకు ఖర్చు పెట్టి ఈ రోజు రాజకీయాలను అసహ్యించుకునే సమాజంలో అందరూ అలోచించి రాజకీయాల్లోకి రావాలని పవన్ కళ్యాణ్ గారు ఒక దీక్ష తీసుకొని జనసేన పార్టీ ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా వస్తున్నారు. మా వంతూ బాధ్యతగా మదనపల్లి నియోజకవర్గంలో వైసీపీ దిగిపోవాల్సిన ఆవశ్యకతని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకతని ప్రజల్లోకి తీసుకోపోతున్నాం. ప్రజలు కూడా మాకు అనుగుణంగా స్పందిస్తూ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా ఉంటాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాయల్, రాష్ట్ర చేనేత విభాగ నాయకులు అడపా సురేంద్ర, ఐటీ విభాగ నాయకులు జగదీష్, మోహన, గడ్డం లక్ష్మీపతి, కుమార్, నాగ, నగేష్, అర్జున, వేణు తదితరులు పాల్గొన్నారు.