జనసేన కార్యకర్త కుటుంబానికి జనసైనికుల ఆర్థిక సహాయం

మాడుగుల: ఇటీవల అనారోగ్యంతో మరణించిన జనసేన కార్యకర్తకి జనసేన నాయకులు, కార్యకర్తలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. చీడికాడ మండలం, అడవి అగ్రహారం గ్రామమునకు చెందిన జనసైనికుడు దారబోయిన రాము అకాల మరణం చెందారు. అతను మరణించడంతో అతని కుటుంబానికి మాడుగుల నియోజకవర్గం జనసేన నాయకులు, జనసైనికుల అందరి సహకారంతో 45000/- రూపాయలు నగదు సమకూర్చి, చోడవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పీవీఎస్ఎన్ రాజు చేతుల మీదగా రాము భార్య, అతని తల్లిదండ్రులకు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం నాయకులు గండి దుర్గ ప్రసాద్, మాడుగుల నియోజకవర్గం నాయకులు ముర్రు ఈశ్వర్, జీవి మూర్తి, కుంచా అంజిబబు, మజ్జి కృష్ణ, గుమ్మడి సంతోష్, గట్టా రామారావు, కాళ్ల హరి బాల, కోన శ్రీను, రాజారెడ్డి, మురికిటి అప్పారావు, అర్జున్ రావు, శివ, రాము, కొండలరావు, కుమార్ మరియు అధిక సంఖ్యలో జన సైనికులు పాల్గొన్నారు.