శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు ఉచిత ఆటో సర్వీసు ఏర్పాటు చేసిన జనసైనికులు

*శ్రీ సౌమ్యనాథ స్వామి:-బ్రహ్మోత్సవాలు

బుధవారం ఉమ్మడి కడప జిల్లా, నందలూరులో అంగరంగ వైభవంగా జరగబోతున్న శ్రీ సౌమ్యనాథ సమేత శ్రీదేవి, భూదేవి ల కళ్యాణంకు ఉమ్మడి కడప జిల్లా నుంచే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచి వచ్చే భక్తులకు నందలూరు జనసైనికుల ఆధ్వర్యంలో ఉచిత ఆటో సర్వీసు ఏర్పాటు చేయడం జరిగింది.
బుధవారం దాదాపు 15 ట్రిప్పులు ఉచితంగా ఆటొల ద్వారా శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంకు భక్తులను చేర్చారు. నందలూరు జనసైనికులు కల్పిస్తున్న ఈ సౌకర్యంను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవలసిందిగా కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమమును నందలూరు జనసైనికులుమరియు జనసేన పార్టీ కువైట్ సభ్యులు సహకారముతో టెంకాయ కొట్టి పూజ చేసి ప్రారంభించారు.