పారిశుధ్ధ్య కార్మికుల ధర్నాకు జనసేన సంఘీభావం

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రధేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం నగరపాలక సంస్ధకు చెందిన వందలాది మంది పారిశుధ్ధ్య కార్మికులు బుధవారం రాజమండ్రి నగరపాలక సంస్ధ కార్యాలయం ఎదురుగా భారీ ధర్నా కార్యక్రమం నిర్వహించటం జరిగింది. పారిశుధ్ధ్య కార్మికులకు సంఘీభావంగా రాజమండ్రి మున్సిపల్ కార్పొరెషన్ జనసేన అధ్యక్షులు వై.శ్రీనివాస్ ఆద్వర్యంలో జన సైనికులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా వై.శ్రీనివాస్ మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులు చేస్తున్న నిరసనలను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ధృష్టికి తీసుకువెళతామని, పారిశుధ్ధ్య కార్మికులు గత రెండున్నర ఏళ్ళగా కోవిడ్ పరిస్ధితుల్లో కూడా వారి ప్రాణాలను ఫణంగా పెట్టి నగరాన్ని శుభ్రపరుస్తున్నారని అలాంటి వారిని ప్రభుత్వం ఈ విధంగా రోడ్లుపై ధర్నాలు చేసే స్ధాయికి తీసుకు రావటం ప్రభుత్వం చేతకాని పరిపాలనకు నిదర్శనమని, ప్రభుత్వం కార్మికుల కుటుంబాలకు ఎలాంటి భధ్రత కల్పించలేదని, వారు అడుగుతున్న న్యాయపరమైన కోరికలు ప్రభుత్వం తక్షణం అమలుచేయాలని, అయిదు నెలల హెల్త్ ఎలవెన్స్ లు వెంటనే ఇవ్వాలని, అవున్ సోస్సింగ్ కార్మికులకు ఉధ్యోగ భధ్రత కల్పిస్తూ పర్మినెంట్ చేయాలని, పారిశుధ్ధ్య కార్మికుల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పును అమలుచేయాలని, అలాగే వారి కొరిన కనీస డిమాండ్స్ ప్రభుత్వం వెంటనే అమలుచేయాలని వై.శ్రీనివాస్ ప్రభుత్వానికి తెలిపారు. జనసేన పార్టీ పారిశుధ్ధ్య కార్మికులు చేస్తున్న ధర్నాకు పూర్తి మధ్ధతుగా ఎప్పుడు ఉంటుందనీ, ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే రాజమహేంద్రవరంలో పారిశుధ్ధ్య కార్మికులకు అండగా వారితోపాటు రోడ్లపై నిరసనకు దిగుతామని ప్రభుత్వాన్ని వై.శ్రీనివాస్ హెచ్చరించారు. తమకు మధ్ధతుగా జనసేన పార్టీ నిలిచినందుకు పారిశుధ్ధ్య కార్మికులు కృతజ్జతలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా కార్యదర్శి తేజోమూర్తుల నరసింహమూర్తి, నగర ఉపాధ్యక్షులు దాసరి గురునాధం, నగర ప్రధాన కార్యదర్శి షెక్ భాషా లిమ్రా, నగర కార్యదర్శలు కప్పల ప్రకాష్, కే.వీ చలపతిరావు, యందం ఇందిర, అల్లాటి రాజు, జనసేన నాయకులు పెండ్యం చంధ్రశేఖర్, దుర్గా, శ్రీను, జనసేన కార్యకర్తలు, వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.