క్రాప-శంకరాయగూడెంలో అగ్ని ప్రమాదం జరిగి ఇళ్ళు దగ్దమైన నిరాశ్రయులకు జనసేన అండ

తూర్పుగోదావరి, అయినవిల్లి మండలం, క్రాప-శంకరాయగూడెం గ్రామంలో అగ్ని ప్రమాదం జరిగి ఇళ్ళు దగ్దమై నిరాశ్రయులైన బొమ్మి వీర వెంకట సత్యనారాయణ, సవరపు సావిత్రమ్మ, చేట్ల కాంతంలను జనసేనపార్టీ నాయకులు పరామర్శించడం జరిగింది. జనసేనపార్టీ నాయకులు తుండూరి సంతోష్ మరియు జనసైనికుల ఆర్థిక సహాయంతో 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు సానబోయిన మల్లికార్జునరావు, జిల్లా కార్యదర్శి మద్దా చంటిబాబు, అయినవిల్లి మండల వైస్ ఎం.పి.పి. అడపా నాగభూషణం, విలస ఎమ్.పి.టి.సి. కుప్పాల రాంబాబు, క్రాప జనసేన పార్టీ అధ్యక్షులు చిక్కం సత్యనారాయణ, జనసేనపార్టీ నాయకులు పడాల గిరి, తోలేటి ఉమ, నిడుమోలు ఉమ, దామిశెట్టి రాజా, మాదాల శ్రీధర్, ఉందుర్తి రమణ, పాయసం సాయి తదితరులు పాల్గొన్నారు.