అక్రమ ఇసుక త్రవ్వకాలపై పల్నాడు జిల్లా కలెక్టర్ కు, ఎస్పీకి జనసేన వినతి

నరసరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఆఫీస్ లో జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో జిల్లాలో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీకి జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి షేక్ జిలాని ఆధ్వర్యంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, వినతిపత్రం అందజేశారు. గత నెల 23వ తేదీన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, చెన్నై వారు ఆంధ్ర రాష్ట్రంలో ఇసుక త్రవ్వకాలు పర్యావరణానికి హాని కలిగేలా జరుగుతున్నాయని వెంటనే నిలుపుదల చేయాలని, మరలా కొత్తగా పర్యావరణ అనుమతులు తీసుకోవాలని అప్పటివరకు ఇసుక త్రవ్వకాలు జరపకూడదని 18 కోట్ల రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు జారీ చేయడం జరిగింది. అయినప్పటికీ అధికార పార్టీ నాయకులు కొందరు అధికారులు అండదండలతో ఇష్టారాజ్యంగా ఇసుక త్రవ్వకాలు జరుపుతున్నారని, జేపి అనే ఒక డొల్ల కంపెనీని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి వందల కోట్ల రూపాయలు దోపిడీ చేస్తున్నారని, ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో పెదకూరపాడు నియోజవర్గ శాసనసభ్యులు ఉమ్మడి గుంటూరు జిల్లాకి సంబంధించిన ఇసుక త్రవ్వకాల కోసం ముఖ్యమంత్రి గారికి నెలకి 20 కోట్ల రూపాయలు చెల్లించే విధంగా ఒప్పందం చేసుకొని ఇష్టానుసారంగా నదికి అడ్డంగా రహదారులు నిర్మించి మరి ఇసుక త్రవ్వకాలు జరుపుతున్నారని, దీనివలన పర్యావరణానికి హాని కలగడమే కాకుండా చాలామంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతుందని, ఇటీవల 15 రోజుల్లోపు పెదకూరపాడు నియోజకవర్గంలో ముగ్గురు, కొల్లిపర మండలంలో ఒకరు ఇసుక త్రవ్వకాల వల్ల ఏర్పడిన ఆగాదాలలో పడి చనిపోయారని తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కి వినతిపత్రం ఇస్తూ ఎన్జీటీ ఆర్డర్ ని అమలు చేయాలని లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ నుండి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించి, ఇసుక రీచ్ ల నుండి ఒక్క లారీని కూడా బయటికి రానివ్వమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శిలు సిరిగిరి శ్రీనివాసరావు, ఎర్రంశెట్టి రామకృష్ణ, దూదేకుల కాశీం సైదా, అంబటి మళ్లీ, అంకారావు, రాజా రమేష్, ఆనంద్, ఈశ్వర్ మరియు నరసరావుపేట, పెద్దకూరపాడు, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరిపేట మరియు పట్టణ నాయకులు,మండల అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.