ప్రతి జనసైనికుడికీ జనసేన భరోసా కల్పిస్తుంది: మర్రాపు సురేష్

గజపతినగరం నియోజకవర్గం: జనసేన పార్టీ గజపతినగరం నియోజకవర్గ నాయకులు మర్రాపు సురేష్ ఆధ్వర్యంలో గురువారం ఐదు మండలాలకు చెందిన ముఖ్య నాయకులు జనసైనికులు వీరమహిళలకు క్రియా సభ్యత్వం చేసిన వాలంటరీలకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసి కిట్లు మండలాల వారీగా వాలంటీర్లకు అందజేశారు. బీమా పత్రం, గాజు గ్లాస్, జనసేన ప్రయాణం పుస్తకం, బ్యాగ్ గాజు గ్లాస్ సింబల్ బ్యాడ్జె, నోట్ పాడ్, ఐడెంటి కార్డుతో కూడిన కిట్ లను అందజేశారు. ఈ సందర్భంగా మర్రాపు సురేష్ వాలంటరీ ఉద్దేశించి మాట్లాడుతూ.. “ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్ జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను మరియు పవన్ కళ్యాణ్ గారు చేసే సేవా కార్యక్రమాలను ప్రజల వద్దకు వెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలి” పార్టీ బలోపేతానికి ప్రాణాలు పణంగా పెట్టి కృషి చేసే కార్యకర్తలకు ఆకస్మిక మరణం జరిగినా, ఏదైనా ప్రమాదం జరిగినా వారి కుటుంబానికి జనసేన భరోసా కల్పిస్తుంది. ప్రమాదవశాత్తు మరణం సంభవిస్తే 5 లక్షలు, ప్రమాదం జరిగితే 50000 రూపాయల ఆరోగ్య భీమా వర్తిస్తుంది. ఈ క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారు ప్రజల్లోకి వెళ్లి జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతాలు వివరిస్తూ జనసేన పార్టీ బలోపేతానికి మీ వంతు భాధ్యత నిర్వహించాలని, రాబోయే ఎన్నికల్లో గాజు గ్లాస్ గుర్తుపై అమూల్యమైన ఓటు హక్కును వేసి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని గ మర్రాపు సురేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గజపతినగరం నాయకులు కలిగి పండు, పైల మహేష్, ఆదినారాయణ, శ్రీను, అనిల్ బెజవాడ దత్తరాజేరు, పిట్టా బాలు గంట్యాడ, జామి రాంబాబు, బాలకృష్ణ, ప్రశాంత్, బొండపల్లి జానీ, బద్రి, ఈశ్వరరావు వీరమహిళలు జనసైనికులు పాల్గొన్నారు.