తిరుపతి జనసేన ఆధ్వర్యంలో ఇంటింటా జనసేన

తిరుపతి నియోజకవర్గంలో ‘నా సేన కోసం.. నా వంతు ‘ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక రైల్వే కాలనీ నందు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి, ఆకేపాటి సుభాషిని, రాజేష్ యాదవ్, మునస్వామి, కీర్తన, నవ్య, విజయారెడ్డి, సాయిదేవ్ మరియు క్రియాశీలక సభ్యులతో కలిసి నిర్వహించడం జరిగింది.”నా సేన కోసం – నా వంతు” కార్యక్రమ ఆవశ్యకతను తెలియజేసి వారి ఇంటికి వద్దకు వెళ్లి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో, ఆ ఆశయాలను వివరిస్తూ, స్థానిక ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని, మీకు జనసేన ఎప్పుడు అండగా ఉంటుందని, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందని, రేపు రాబోయే ఎలక్షన్లలో పవన్ కళ్యాణ్ ను ఆదరించాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన, చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలను వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ నాయకులు, రాష్ట్ర మరియు జిల్లా నాయకులు, జనసైనికులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.