విజయనగరంలో జనసేన భోగి పండుగ సంబరాలు

  • విజయనగరం నియోజకవర్గ జనసేన ఝాన్సీ వీరమహిళలకు, జనసైనికులు మరియు టిడిపి నాయకులు కార్యకర్తలకి భోగి పండుగ శుభాకాంక్షలు

విజయనగరం నియోజకవర్గం: భోగి సందర్బంగా విజయనగరం అశోక్ బంగ్లా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ దగ్గర తెలుగుదేశం పార్టీ విజయనగరం అసెంబ్లీ ఇంచార్జి అతిధి గజపతిరాజు ఆధ్వర్యంలో భోగి మంటలు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ భోగి మంటల్లో నాలుగున్నర సంవత్సరాల వైసీపీ విధ్వంస పాలన చీకట్లను తగులబెట్టి, రానున్న మార్పుకు స్వాగతం పలికేందుకు భోగి మంటల సాక్షిగా ప్రతీ ఒక్కరూ ప్రమాణం చేయాలని, ప్రజలందరి జీవితాల్లో సంతోషం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నామని ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి విజయనగరం నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీమతి పాలవలస యశస్వి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వీరమహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.