మందమర్రి జనసేన ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

మంచిర్యాల జిల్లా, మందమర్రి, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మందమర్రి మార్కెట్ ఏరియాలో మహిళలతో కేక్ కటింగ్ చేసి స్వీట్స్ పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ, మాయ రమేష్ మాట్లాడుతూ… దేవతలుగా పూజించే స్త్రీలను ఈ సమాజం అత్యాచారం, అవమానం శాపమై పీడిస్తున్నాయి, సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే మన ప్రగతికి మూలం, సమాజంలో మహిళకు రక్షణ లేకుండా పోయింది. రాష్ట్ర ప్రభుత్వం మహిళలపైన మహిళల రక్షణకే ఒక జీఓ తీసుకురావాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మహిళా మూర్తులు, బత్తుల సుజాత, గంగాభవాని, షాహిన్, నాగలక్ష్మి, సరిత, ప్రశాంతి, దివ్య, శ్వేత, తదితరులు పాల్గొన్నారు.