నరసన్నపేటలో జనసేనాని జన్మదిన వేడుకలు

*రెల్లి కాలనీలో కేక్ కటింగ్

నరసన్నపేట, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు నరసన్నపేట నియోజవర్గంలో పనుతుల జయరాం ఆధ్వర్యంలో శనివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలలో భాగంగా జనసేన పార్టీ ఆదేశాల మేరకు నరసన్నపేట నియోజకవర్గ జనసేన నాయకులు సారవకోట మండలం సారవకోట పంచాయతీలో రెల్లి సోదరులను కలవడం జరిగింది. రెల్లి సోదరుల బాగోగులు మరియు కాలనీకి సంబంధించిన సమస్యల వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగింది. రెల్లి సోదర సమక్షంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం కేక్ కట్ చేసి జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారుగా 30 కుటుంబాలని జనసేన పార్టీలో జాయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసన్నపేట నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పనుతుల జయరాం, సారవకోట మండల నాయకులు, జనసైనికులు రెల్లి వీధికి సంబంధించిన నాయకులు పాల్గొనడం జరిగింది.

  • గుడుంబా శంకర్ చిత్ర ప్రదర్శన

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా నరసన్నపేట శ్రీదేవీ సినిమా హల్ నందు గుడుంబా శంకర్ సినిమా ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జనసైనికుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నరసన్నపేట జనసేన నాయకులు పనుతుల జయరాం, తనకాల శంకరావు డోల చంద్రభూషనరావు, ఎన్ని లక్ష్మణరావు, వీరమహిళ జహన్వి మరియు నరసన్నపేట జనసైనికులు వీరమహిళలు పాల్గొన్నారు.

  • శ్రీ మొఖలింగం దేవస్థానంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా శ్రీ మొఖలింగం దేవస్థానంలో వేద పండితులతో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నరసన్నపేట జనసేన నాయకులు జయరామ్, జలుమూరు మండల అధ్యక్షలు చిరంజీవి కత్రివానిపేట ఉప సర్పంచ్ బాలకృష్ణ, కమనాపల్లి జనసైనికులు క్రాంతి, సత్యం, శ్రీను, శంకర్, ఈశ్వర్, తేజ, వాసు పాల్గొన్నారు.