జనసేనాని జన్మదినం పురస్కరించుకుని దుప్పట్లు పంపిణీ చేసిన బత్తుల

రాజానగరం, జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తరపున తమ నాయకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజానగరం నియోజకవర్గం చక్రద్వారబంధం గ్రామ జనసేన నాయకుల ఆధ్వర్యంలో వృద్దులకు రాజానగరం జనసేన పార్టీ ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

కోరుకొండ గ్రామంలో విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన వస్తువులు అందజేసిన బత్తుల

రాజానగరం, జనహితం కోరే మన జనసేనాని జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు తరపున తమ నాయకునికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాజానగరం నియోజకవర్గం ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో కోరుకొండలో గల బిసి, ఎస్సి హాస్టల్ విద్యార్థులకు రాజానగరం జనసేన పార్టీ నాయకురాలు శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి వారికి అవసరమైన వస్తువులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.

శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపనలో పాల్గొన్న బత్తుల

రాజానగరం మండలం, చక్రద్వారబంధం గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం శంకుస్థాపనలో రాజానగరం నియోజవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్ బత్తుల బలరామకృష్ణ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ కమిటీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.