ఏలూరు జనసేన ఆధ్వరంలో జనసేనాని జన్మదిన వేడుకలు

  • మాతృమూర్తి మదర్ థెరిస్సా 111 వ జయంతి సందర్భంగా నివాళులు

ఏలూరు, సెప్టెంబర్ 2 వ తేదీన ఉ. 9:00 గంలకు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ అధ్వర్యంలో ఆశ్రం హాస్పిటల్ వారిచే ఉచిత మెగా వైద్య శిభిరం ఏర్పాటు చేయనున్నారని మీడియా ముఖంగా రెడ్డి అప్పల నాయుడు తెలియజేశారు.

ఈ వైద్య శిబిరంలో ఉచితముగా చేయు పరీక్షల వివరములు:

ఈ.సి.జి పరీక్షలు, షుగర్, బిపి పరిక్షలు, సాధారణ వైద్య పరిక్షలు, ఎముకలు (ఆర్థో), కంటి పరిక్షలు, చెవి, ముక్కు, గొంతు(ఈ.ఎన్.టి) పరీక్షలు, ఊపిరితిత్తుల పరీక్షలు (పల్మనాలజి), స్త్రీల గర్భ పరీక్షలు (గైనిక్) చేయించి ఉచితముగా మందులు పంపిణీ చేయనున్నామని అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్ చేస్తారని రెడ్డి అప్పల నాయుడు తెలియజేశారు. కావున ఏలూరు నియోజకవర్గ ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరని కోరారు.

రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించే వ్యక్తి ఒక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే తప్ప మరే ఇతర పార్టీల నాయకులు లేరని అలాగే ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు తన సొంత కష్టార్జితం నుండి 30 కోట్ల రూపాయలను వారి కుటుంబాలకు అందించి వాళ్ళ పిల్లల చదువుల బాధ్యతలు కూడా తన భుజాలపై వేసుకుని అలాగే రాష్ట్రంలో ప్రజలు ఏ విధమైన సమస్యలకు గురౌతున్నారో తెలుసుకునేందుకు జనవాణి కార్యక్రమం నిర్వహించి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్య పరిష్కరించే దిశగా పనిచేసే ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని రెడ్డి అప్పల నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం మాతృమూర్తి మదర్ థెరిస్సా 111 వ జయంతి సందర్భంగా ఏలూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, ఉపాధ్యక్షులు బొత్స మధు, ఫ్యాన్స్ ప్రెసిడెంట్ దోసపర్తి రాజు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, నాయకులు కందుకూరి ఈశ్వరరావు, తుమరాడ రమణ, మజ్జి హేమంత్, వెంకట రమణ, బుధ్ధా నాగేశ్వరరావు, తేజ, శివ మరియు జనసైనికులు పాల్గొన్నారు.