జనసేన బస్టాండ్ ప్రారంభం

సత్యవేడు నియోజకవర్గం, బి. ఎన్ కండ్రిగ మండలం, ఎన్టీఆర్ నగర్ లో మండల అధ్యక్షుడు జె. భాషా ఆధ్వర్యంలో.. జిల్లా కార్యదర్శి కొప్పల లావణ్య కుమార్ చేతుల మీదగా.. జనసేన బస్టాండ్ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా లావణ్య కుమార్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం ప్రజా సేవలో ఒక భాగమని ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు మన మండలంలో మరెన్నో చేపట్టాలని.. దీనికి ఎప్పుడు మా సహకారం మీకు ఉంటుందని తెలియచేసారు. ఈ కార్యక్రమానికి వరదయ్యపాలెం మండల అధ్యక్షుడు చిరంజీవి ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు కృష్ణ, సంయుక్త కార్యదర్శులు నవీన్, మారయ్య, మరియు శరత్, సిద్దూ, రాజా, ప్రకాష్, ధనశేఖర్, చందు, సుబ్బు, మహేంద్ర, తరుణ్, ఢిల్లీ, కృష్ణ పాల్గొన్నారు.