సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలంటూ అఖిలపక్షం ధర్నా

పిఠాపురం పట్టణం ప్రధాన సెంటర్ లో సులభ్ కాంప్లెక్స్ నిర్మాణం తక్షణమే చేపట్టాలని అఖిల పక్షం ప్రతినిధులు మున్సిపల్ చైర్ పర్సన్, కమీషనర్ కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్బంగా మన ఊరు మన బాధ్యత స్వచ్చంధ ప్రతినిధులు కొండేపూడి శంకర్రావు మాట్లాడుతూ 2019 లో కౌన్సిల్ తీర్మానం జరిగి, స్థలసేకరణ జరిగి, నిధులు మంజూరు అయినా కూడా ఇప్పటికీ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు మీన మేషాలు లెక్కపెడుతూ తాత్సారం చేయడం తగదన్నారు. సులబ్ కాంప్లెక్స్ నిర్మాణం ఆలస్యం చేయడాన్ని నిరసిస్తూ స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు.తక్షణమే సులభ్ కాంప్లెక్స్ పనులు చేపట్టాలని, అలాగే మున్సిపల్ చైర్ పర్సన్ ఒక మహిళగా ప్రయాణించే మరోక మహిళ ఇబ్బందిని అర్ధంచేసుకుని తక్షణమే దీనిపై స్పందించి మహిళలకు కావలసిన కనీస అవసరాన్ని తీర్చగలరని సులబ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఆమోదం తెలపాలని అఖిలపక్షం కమిటీ ద్వారా జనసేనపార్టీ తరుపున వీరమహిళలుగా మేము కోరుతున్నాం లేనిపక్షంలో పనులు చేపట్టే వరకూ ప్రజా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. మున్సిపల్ ఛైర్పర్సన్, కమీషనర్ కు అఖిలపక్షం తరపున వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళ పిల్లా రమ్యజ్యోతి, టీడీపి నాయకులు అల్లవరపు నగేష్, సిపిఎం మరియు సీపీఐ నాయకులు కోనేటి రాజు, సూరిబాబు, రత్న కుమారి, కార్యకర్తలు, జనసైనికులు టైల్స్ బాబీ,వై శ్రీనివాస్,వేల్పుల చక్రదర్,గోవిందరాజులు, మన‌ ఊరు మన బాధ్యత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.