నగరం పోలీస్ స్టేషన్లో జనసేన ఫిర్యాదు

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం మీద కుటుంబ మహిళల పట్ల సోషల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్ లో అసభ్యకరంగా మాట్లాడిన వైసిపి రవీందర్ రెడ్డి పై శనివారం మామిడికుదురు మండల జనసేన పార్టీ తరఫున నగరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జె.ఎస్.ఆర్, ఎంపీటీసీలు వాసంశెట్టి వెంకటరమణ, చెరుకూరి పార్వతీ సత్తిబాబు, నాయకులు కంకిపాటి నరసింహారావు, ఉపసర్పంచులు తుండూరి బుజ్జి, ఘనసాల దీపిక బాబి, ఉపాధ్యక్షులు దొడ్డ జయరాం, మండల ప్రధాన కార్యదర్శిలు మంద గాంధీ, తోరం యువరాజు, బత్తుల శేఖర్, కార్యదర్శి అడబాల చిన్ని, కాట్రేనిపాడు నాగేంద్ర, గ్రామ శాఖ అధ్యక్షులు ఎల్లమెల్లి పండు, గిడుగు బంగారం, నాయకులు కటకంశెట్టి కృష్ణ, వీధి సత్తిబాబు, సర్కిల్ రాజా అబ్బాస్, కొమ్ముల రాము తదితరులు పాల్గొన్నారు.