వైసీపీ సోషల్ మీడియాపై పోలీసులకు జనసేన ఫిర్యాదు

నాగర్ కర్నూల్ నియోజకవర్గం: ఇటీవల సోషల్ మీడియాను వేదిక చేసుకొని సామాజిక మాధ్యమాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై పవన్ కళ్యాణ్ సతీమణి శ్రీమతి అన్నా లేజినోవాపై అసభ్య పదజాలంతో పోస్టులు పెడుతున్న నాయకులపై సామాజిక మాధ్యమాల అకౌంట్స్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ ఉపాధ్యక్షులు మహేందర్ రెడ్డి, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ నేమురి శంకర్ గౌడ్, పార్టీ రాష్ట్ర నాయకులు రామ్ తాళ్లూరి, రాధరం రాజలింగం ల పిలుపు మేరకు, సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా డి.ఎస్.పి కి కంప్లైంట్ లెటర్ ను పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన అధ్యక్షులు నాగర్ కర్నూల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంగ లక్ష్మణ్ గౌడ్ అందజేసారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ నియోజకవర్గ నాయకులు గోపాస్ కుర్మన్న, కొడిగంటి సాయి కుమార్, విజయ్ భాస్కర్ గౌడ్, సూర్య, రాజు నాయక్, మహేష్ గౌడ్, మహేష్, ఎడ్ల ప్రసాద్, అనుపటి పవన్ కుమార్, సందీప్, పూస శివ, డి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.