అక్రమ అరెస్టులను ఖండించిన జనసేన

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంఛార్జి నేమూరి శంకర్ గౌడ్, ఉమ్మడి జిల్లా ఇంఛార్జి సైదాల శ్రీనివాస్ ల నాయకత్వంలో సామరస్యంగా విద్యార్థులకు మద్దతుగా వెళ్తున్న జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు, జనసైనికులు జింక హరీష్, ఆర్మూర్, రాజు, గంధం అఖిల్, అర్జున్, పాండు, చంద్ర శేఖర్, శ్యామ్, లక్ష్మణ్, ఆనంద్ లు వాళ్ల ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థులను మాట్లాడించడానికి వెళ్తే పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి జైల్లో పెట్టడాన్ని జనసేన పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేయడం ఇవ్వాళ కొత్త కాదు, ఇదే యునివర్సిటీలో గతంలో అందులో పనిచేస్తున్న మేస్ కార్మికులు తమ వేతనాలు పెంచాలని, సెక్యూరిటీ సిబ్బంది, హౌస్ కీపింగ్ వర్కర్స్ మరియు చదువు చెప్పే అద్యాపకులు కూడా ఎన్నో సార్లు ఎన్నో రోజులు ధర్నాలు రాస్తారోకోలు చేశారు. కాని ఇంకా ఇప్పటి వరకు వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. యునివర్సిటీలో విసి పర్మనెంట్ లేడు, వసతి మంచిగా లేదు, భోజనం సరిగా పెట్టరు, చదువుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం, ల్యాప్ టాప్ లు, పరిశోధన కేంద్రాలు, ఏ ఒక్కటి కూడా సక్రమంగా లేవు. కాబట్టి విద్యార్థులు చాలా సంవత్సరాలుగా ఓపిక పట్టి పిడికిలి బిగించి పోరాటం చేస్తున్నారు. విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటం ఆడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని వారి న్యాయమైన డిమాండ్స్ ను పరిష్కరించేంత వరకు పోరాటం కొనసాగిస్తామని అన్నారు.