64 వ వార్డ్ లో వాటర్ బోర్ బాగుచేయించిన జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక, 64 వార్డ్ దిబ్బపాలెం గ్రామంలో వాటర్ బోర్లు చాలా కాలంగా పనిచేయడం లేదు ఈ విషయం దిబ్బపాలెం జనసేన కార్యకర్తలు 64 వార్డ్ కార్పొరేటర్ శ్రీ దల్లి గోవింద్ రెడ్డి కి చెప్పటం జరిగింది. ఆయన వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి స్వయంగా దల్లి గోవింద్ రెడ్డి దగ్గర ఉండి రిపేర్ చేయించారు. ఈ కార్యక్రమంలో వార్డు జనసేన కార్యకర్తలు చోడి పిల్లి ముసలయ్య, గంటిపిల్లి లక్మయ్యా, కదిరి సత్యనారాయణ, సమ్మిడి సురేష్, నోల్లి తాతారావు, వతాడ పైడిరాజు పాల్గొన్నారు.