రిమ్స్ లో జనసేన కార్పొరేటర్ మలగా రమేష్ బృందం పర్యటన

  • రిమ్స్ లో వైద్య సేవలు అధ్వానం
  • రోగుల పట్ల నిర్లక్ష్యం, సమయపాలన పాటించని వైద్యులు, ముందుల కొరత
  • ఆసుపత్రిలో పడకేసిన పారిశుద్ధ్యం, కుక్కలు స్వైర విహరం
  • మౌళిక వసతులు, సదుపాయాలు నిల్

ఒంగోలు, కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ వైద్యశాలలో వైద్య సేవలు అందిస్తున్నామని వైకాపా ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడమే కాని, ఆచరణలో మాత్రం అది శూన్యమని జనసేన కార్పొరేటర్, నగర అధ్యక్షులు మలగా రమేష్ ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రమైన రిమ్స్ వైద్యశాలలో వైద్య సేవలు అధ్వానంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నేతలతో కలిసి శుక్రవారం మలగా రమేష్ రిమ్స్ వైద్యశాలలో పర్యటించారు. వైద్య సేవలు అందే విధానాన్ని రోగులను అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, వసతులు, మౌళిక సదుపాలయాల కల్పనలో ప్రభుత్వం విఫలం చెందిందని విమర్శించారు. ఈ సందర్భంగా మలగా రమేష్ మాట్లాడుతూ రిమ్స్ లో సమస్యలు విళయతాండవం చేస్తున్నాయన్నారు. పేదోడికి పెద్దాసుపత్రిగా ఉన్న రిమ్స్ పరిస్థితి నేడు అగమ్యగోచరంగా మారిందన్నారు. పేద ప్రజలకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పారిశుద్ధ్యం అధ్వానంగా ఉందన్నారు. మరుగుదొడ్ల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. రిమ్స్ ఆవరణంలో కుక్కుల బెడద వైద్యశాలకు వచ్చే ప్రజల్లో భయాందోళన కలిస్తోందన్నారు. త్రాగేందుకు మంచినీరు కూడా దొరకని పరిస్థితి చూస్తుంటే వైకాపా పాలన ఎలా ఉందో అర్థమైపోతోందన్నారు. గుండె, కేన్సర్, కీలు మార్పిడి వంటి పెద్ద రోగాలకు వైద్య సేవలు అందడం లేదన్నారు. వైద్యుల కొరత వెంటాడుతోందన్నారు. ఉన్న వైద్యులు సమయపాలన పాటించడం లేదని ధ్వజమెత్తారు. జిల్లా నలుమూలల నుండి వచ్చే ప్రజలకు రిమ్స్ లో సమస్యలు స్వాగతం పలుకుతున్నాయని ఎద్దేవా చేశారు. స్కానింగ్, ఎక్సరే తీయడంలో అలసత్వం, సమయానికి తీసే పరిస్థితి లేదన్నారు. రోగులు ఉండే వార్డుల్లో కొన్ని చోట్ల కనీసం ఫ్యాన్లు కూడా తిరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత రెండు నెలల నుంచి పోల్చుకుంటే గణనీయం ఒపిల సంఖ్య పడిపోయిందన్నారు. ముందుల కొరత కూడా అధికంగా ఉండటంతో బయట మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ వైద్యశాల రిమ్స్ లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందిస్తున్నామని నేతలు గొప్పలు చెప్పుకోవడమే తప్పా, రిమ్స్ కు వచ్చే ప్రజానీకాని మాత్రం తిప్పలు తప్పడం లేదన్నారు. ఇప్పటికైన ప్రభుత్వ వైద్యం పేదలకు అందిలే రిమ్స్ వైద్యశాలపై ప్రత్యేక పర్యవేక్షణ, శ్రద్ధ పెట్టాలన్నారు. రోగులకు న్యాయమైన వైద్య సేవలు, మందులు అందించాలన్నారు. రిమ్స్ ఆవరణలో పారిశుద్ధ్యం మెరుగుపడేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. లేదంటే జనసేన పక్షాన ప్రభుత్వ తీరుపై పోరాడుతోందని కార్పొరేటర్ మరియు జనసేన నగర అధ్యక్షులు మలగా రమేష్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రాయని రమేష్, కృష్ణా, పెన్నా ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బొందిల శ్రీదేవి, నగర ప్రధాన కార్యదర్శులు మార్టూరి మణి, పల్లా ప్రమీల, నగర కార్యదర్శులు గోవింద్ కోమలి, గోలకారం మనోజ్, టంగుటూరి శ్రీను, సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉషా, గంధం నరేష్, ఇంకొల్లు శివయ్య, 2వ డివిజన్ అధ్యక్షులు బ్రహ్మనాయుడు, 5వ డివిజన్ అధ్యక్షులు ప్రసాద్, 8వ అధ్యక్షులు ఉదయ్, 12వ డివిజన్ అధ్యక్షులు కటకంశెట్టి అనిల్, 20వ డివిజన్ అధ్యక్షులు మణి కుమార్, 21వ డివిజన్ అధ్యక్షులు వాసుకి నాయుడు, 25వ డివిజన్ అధ్యక్షులు పోకల నరేంద్ర, 33వ డివిజన్ అధ్యక్షులు హరి రాయల్, 37వ డివిజన్ అధ్యక్షులు నరహరి సాంబయ్య, 41వ డివిజన్ అధ్యక్షులు పేర్ణమిట్ట పవన్ కుమార్, 42వ డివిజన్ అధ్యక్షులు చల్లా కృష్ణ, 48వ అధ్యక్షులు వెంకటేశ్వర్లు, 49వ డివిజన్ అధ్యక్షులు మాల్యాద్రి, చెరుకూరి ఫణి కుమార్ జిల్లా కార్యనిర్వహణ కమిటి సభ్యులు బొందిల మధు, వీరమహిళ కళ్యాణి, కోటి, అజయ్, అర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.