సత్యవేడు నియోజకవర్గంలో జనం కోసం జనసేన

సత్యవేడు నియోజకవర్గం: జనం కోసం జనసేన 3వ రోజు కార్యక్రంలో భాగంగా సత్యవేడు నియోజకవర్గం, సత్యవేడు మండలం, కాలమనాయుడుపేట పంచాయతీలో సోమవారం జనసేన పార్టీ సిద్ధాంతాలను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ఇంటింటికి ప్రజలకు తెలియజేస్తూ సరికొత్త రాష్ట్రాన్ని చూడాలంటే రాబోవు తరాల పిల్లలు భవిష్యత్తు బాగుండాలంటే అది పవన్ కళ్యాణ్ గారి వల్ల మాత్రమే సాధ్యపడుతుందని, అనుక్షణం పవన్ కళ్యాణ్ గారి బాటలో నడుస్తూ, మండల అధ్యక్షులు కూరాకుల రూపేష్ గారి వెన్నంటూ ఉంటూ, జనసేన పార్టీ ద్వారా ప్రజల సమస్యలపై పోరాడుతూ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు మేము ఉన్నాము అనే ఒక ధైర్యాన్నిస్తూ, నిరంతరం ప్రజలు బాగుండాలని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలని కోరడం జరిగింది. ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పాలనతో విసుగు చెంది పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు హేమంత్ చెంచయ్య, ప్రధాన కార్యదర్శి డి. వి. ఎస్ విజయ్ కుమార్, జోతిశ్వర్, టి. కుమార్ ప్రసన్న కుమార్, కార్యదర్శి మునిశేఖర్ పాల్గొనడం జరిగింది.