జనసేన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్

చిత్తూరు జిల్లా, చిత్తూరు నియోజకవర్గంలో జరిగిన జనసేన క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిధిగా జనసేన రాష్ట్ర పిఏసి సభ్యులు మరియు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ పాల్గొన్నారు. ఈ టోర్నమెంటులో 16 టీములు పాల్గొని ఫైనల్ కు సీసీఎఫ్ XI, ఎస్.జి XI టీములు రాగా మొదట బ్యాటింగ్ చేసిన సీసీఎఫ్ XI 168/3 వికెట్స్ కోల్పోగా ఎస్.జి XI టీం ఆ టార్గెట్ చేరుకోలేక 159/7 వికెట్లతో ఓడిపోయారు. విన్నర్స్ సీసీఎఫ్ XI మరియు రన్నర్స్ ఎస్.జి XI గా నిలిచారు. విన్నర్స్ మరియు రన్నర్స్ కు, మాన్ ఆఫ్ ది సిరీస్, మాన్ ఆఫ్ ది మాచ్, బెస్ట్ బాట్స్ మాన్ లకు ట్రోఫీతో పాటు ప్రైజ్ మనీని అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్ లోచన్ శ్రీరామ్ ప్రధమ బహుమతి స్పాన్సర్స్ లోచన్ శ్రీరామ్ రూ.50000/-, పూల చందు ద్వితీయ బహుమతి రూ.25000/-, దయారామ్ తృతీయ బహుమతి రూ.10000/-. దీరజ్ భోజనం మరియు త్రాగునీరు ఏర్పాటు చేసారు. క్రీడలు మానసిక ఉల్లాసం కలుగ చేస్తాయి. ఆరోగ్యవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్ధుతాయి. ఉల్లాసవంతమైన వ్యక్తులుగా రూపొందిస్తుంది. గౌరవవంతమైన వ్యక్తులుగా తయారు చేస్తుంది. ఆనందకరమైన జీవితానిస్తుంది జనసేన పార్టీ అధికారంలోకి రాగానే క్రీడలకు అధిక ప్రాధాన్యత కలిగిస్తాం అని డా.పసుపులేటి హరిప్రసాద్ తెలియచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో గంగాధర నెల్లూరు ఇంచార్జ్ పొన్న యుగంధర్, పీలేరు ఇంచార్జ్ బెజవాడ దినేష్, ప్రధాన కార్యదర్శి తులసి ప్రసాద్, జిల్లా కార్యదర్శులు భాను ప్రసాద్, యస్వంత్, బాటసారి, చిత్తూరు టౌన్ ప్రెసిడెంట్ సంతోష్, పట్టణ కార్యదర్శి శ్రీధర్ అంజలి, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.