తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని జనసేన డిమాండ్

నిడదవోలు నియోజకవర్గం, నిడదవోలు మండల పరిధిలో సింగవరం, ఆంజనేయపురం, తీరుగూడెం గ్రామంలో అకాల వర్షాలతో నష్టపోయిన రైతుల పంటలు, సకాలంలో ధాన్యం గోను సంచులు ఇవ్వక పోవడానికి, తడిసి, ధాన్యం మొలకెత్తడనికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యం అని, తక్షణమే ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేసారు. అలాగే రైతులందరు మాట్లాడుతూ మా ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు మండలం జనసేన అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం, పట్టణ నాయకులు రంగా రమేష్, గోపినాధ్, సేపేన ప్రసాద్, శివసాయి, చంటి, రాజా, రూపేంద్ర, అంజన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.