పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కేటాయించి ప్రభుత్వ ఆస్థిని కాపాడాలని జనసేన డిమాండ్

కాకినాడ జిల్లా కాకినాడ, 14 సోమవారం జనసేన పార్టీ పిఏసి సభ్యులు, పంతం నానాజీ, పితాని బాలకృష్ణ ఆధ్వర్యంలో మండపేట జనసేన పార్టీ ఇన్చార్జ్ వేగుళ్ళ లీలాకృష్ణ, అమలాపురం పార్టీ ఇన్చార్జ్ శెట్టిబత్తుల రాజుబాబు తదితర పార్టీ నాయకులు ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామానికి చెందిన సుమారు 35, ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసి బ్యాంక్ లో తనక పెట్టి సుమారుగా 5, కోట్ల రూపాయలు అప్పు తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు 2020, అప్పటి రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ అధికారి, ల్యాండ్ ప్రాసెసింగ్ అధికారి కలిసి సర్వే చేసి తోట కబ్జా చేసిన భూమి ప్రభుత్వానికి చెందినదిగా నివేదిక అందించారు. అలాగే కాకినాడ జిల్లా కలెక్టర్ కి కూడా నివేదిక అందినట్లు రికార్డుల్లో ఉందని ఆయినా అధికారులు స్పందించలేదని ఇప్పటికైనా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కబ్జా చేసిన భూమిని అధికారులు పేద ప్రజలకు ఇళ్ల స్థలాలకు కేటాయించి ప్రభుత్వ ఆస్థిని కాపాడాలని డిమాండ్ చేస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు.