జనసేనానికి, చిల్లపల్లి శ్రీనివాసరావుకి కృతజ్ఞతలు తెలియజేసిన ఇప్పటం గ్రామపెద్దలు

మంగళగిరి, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావుని ఇప్పటం గ్రామ పెద్దలు, జనసేన నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు తదితరులు కలిసి సత్కరించి, కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటం గ్రామస్తులు చిల్లపల్లి శ్రీనివాసరావుతో మాట్లాడుతూ… ఇప్పటం గ్రామంలో అక్రమంగా ఇల్లులు కూల్చివేత సమస్యపై నిలబడి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి మా సమస్యను తీసుకువెళ్లి జనసేన పార్టీ తరఫున మాకు అండగా నిలబడినందుకు మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్వయంగా మా గ్రామానికి వచ్చి మాకు అండగా నిలబడినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసి హర్షం వ్యక్తం చేశారు.