నాడు నేడు కింద పాఠశాల భవనం మంజూరు చేయాలని డిమాండ్ చేసిన జనసేన

అరకు నియోజకవర్గం, డుంబ్రిగుడా మండలం, పోతాంగి పంచాయతి లివిటి ఫుట్ గ్రామంలో జనసేనపార్టీ నాయకులు అరకు పార్లమెంట్ అధికార ప్రతినిధి మాదాల శ్రీరాములు, వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కొనెడి లక్ష్మణరావు, నియోజకవర్గం నాయకుడు బంగారు రామదాసు గ్రామంలో పర్యటించారు. లివిటి ఫుట్ గ్రామంలో స్కూలులో వెళ్లి పిల్లలతో మాట్లాడటం జరిగింది. రేకుల షెడ్డులో పిల్లలకు చదువు చెప్పడం చూసిన నాయకులు చలించిపోయారు . ఉపాద్యాయులతో మాట్లాడి నాడు నేడు కింద పాఠశాల భవనం మంజూరైందని 2 సంవత్సరాల నుండి చెప్తున్నారు ఇప్పటికి మంజూరు కాలేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు ITDA PO స్పందించి పాఠశాల భవనం మంజూరు చేసి త్వరగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారని జనసేనపార్టీ నాయకులు శ్రీరాములు తెలిపారు . ఈ కార్యక్రమంలో డుంబ్రిగుడా మండల నాయకులు రాజు, అరకు వ్యాలీ మండల నాయకులు రామకృష్ణ, ZPTC అభ్యర్థి చినబాబు పాల్గొన్నారు.