జగద్గిరిగుట్ట డివిజన్ లో బస్తి దవాఖాన ఏర్పాటు చేయాలని జనసేన డిమాండ్

జగద్గిరిగుట్ట డివిజన్ జనసేన పార్టీ అధ్యక్షులు వడ్లకొండ జీవన్ ఆధ్వర్యంలో బస్తీ దవాఖాన ఏర్పాటు కోసం నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గ్రేటర్ కమిటీ సెక్రెటరీ నందగిరి సతీష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ… దిగువ మధ్యతరగతి, నిరుపేద కుటుంబాలు నివాసం ఉండే మన జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని బస్తీలకు ప్రభుత్వం అందుబాటులో వైద్య సదుపాయాలు కల్పించలేక పోవడం చాలా బాధాకరం. ఈ ప్రాంతానికి బస్తీ దవాఖాన మంజూరు అయి ఆరు నెలలు కావస్తున్నా, పలు పార్టీలు, స్వచ్చంద సంస్థలు నిరసన గళాన్ని వినిపిస్తున్నా, అధికారులు నాయకులు ఇన్ని రోజులుగా స్థలాన్ని వెతుకుతున్నాం అనే సాకు చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పుడేమో శ్రీనివాస్ నగర్ లోని మీ సేవ భవనంలో సగానికి గోడ కట్టి అటు వైపు మీ సేవ కార్యాలయ పనులు, ఇటు వైపు బస్తీ దవాఖానను నిర్వహించాలని అధికారులు స్థానిక నాయకులు చూడటం చాలా వుడ్డూరం. మోడల్ మార్కెట్ కోసం అంటూ రెండు అంతస్తుల ఈ భవనాన్ని నిర్మించి నిరుపయోగంగా వదిలేసారు. అలాంటి ఇరుకు భవనంలో కాకుండా అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని, అక్కడ బస్తీ దవాఖాన ఏర్పాటు పనులు ఆపేసి, రాజీవ్ గృహకల్ప వద్ద గల మోడల్ మార్కెట్ కోసం అంటూ నిర్మించిన ఈ భవనంలో, ప్రజల ఆరోగ్య పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని బస్తీ దవాఖాన ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రమేష్, శివ కళ్యాణ్, దుర్గ ప్రసాద్, విజయ్ రాజ్, వెంకటేష్, కిరణ్, లక్ష్మణ్, లాన వెంకట్, గణేష్, సతీష్, నాగరాజు, ప్రవీణ్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.