బాదుడే బాదుడు.. జగనన్న బాదుడుకు జనసేన పార్టీ నిరసనలు..!!

*ర్యాలీగా సాగి అధికారులకు వినతి పత్రం అందజేసిన పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి మాకినీడి శేషుకుమారి..!!

తూర్పు గోదావరి జిల్లా, పిఠాపురం టౌన్ లో… కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి ఇది చిరంజీవి గారి పాట.. బాదితే బాదాలిరా ప్రజల్ని బాదాలి అనేది జగన్ కాన్సెప్ట్. చిరంజీవి గారి సిక్స్ అటుంచితే.. జగనన్న బాదుడి వైపు ఒకలుక్కేస్తే పెంచిన విద్యుత్ చార్జీలు.. ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమం చేబట్టారు అందులో భాగంగా.. పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ చార్జీ మాకినీడి శేషుకుమారి
ఆధ్వర్యంలో బుధవారం పిఠాపురం స్థానిక జనసేన పార్టీ కార్యాలయం దగ్గర నుండి ఉప్పాడ బస్టాండ్ చర్చ్ సెంటర్లలో నిరసనలు తెయజేస్తూ.. అగ్రహారం కరెంటు ఆపీసుకి ర్యాలిగా చేరుకుని సబ్ స్టేషన్ లో సంబదిత అధికారులకు పెంచిన చార్జీలు తగ్గించాలనే డిమాండ్లతో కూడిన మోరాండంను అందజేయడం జరిగింది. అనంతరం మాకినీడి శేషుకుమారి మీడియాతో మాట్లాడుతూ.. ఒక్క చాన్స్ అడిగి.. పాదయాత్రలో ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు ఓట్లువేసి151 సీటులిస్తే.. ఆ ఒక్క చాన్స్ కు ధరలు పెంచేసి.. సామాన్య ప్రజలపై బాదుడే బాదుడిగా ఉపయోగించుకుంటున్నారని మూడు సంవత్సరాల పరిపాలనలో.. మొన్న కరెంటు చార్జీలు, నిన్న ఆర్టీసి బస్ చార్జీలు రానున్న కాలంలో పెంచేవి దేవుడుకే ఎరుక.. అదనంగా 300 యూనిట్లు దాటితే అమ్మబడి ఉండదని, అమ్మవడి రెండుసార్లు అమలు చేసి.. మూడోసారి మంగళం పలికే పనిలో పడ్డారన్నారు. సుభిక్షత పాలనిస్తానని భకాసురుడిలా ఫ్రజల్ని భయపెడుతున్నారు. ఇటీవల కాలంలో పంట నష్టం వాటిల్లి రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. కనీసం పరామర్శకూడా నోచుకోని పాలన జగన్ పాలన. సామాన్య ప్రజలపై ఇంత దారుణంగా ధరలు బాదుడుకు విసుగు చెందిన రాష్ట్ర ప్రజలు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కోరుకుంటున్నారని, అందులో భాగంగానే నాయకులు, జనసైనికులు, వీర మహిళలు తమ నాయకుడిని ముఖ్యమంత్రి చేసే విధంగా కష్టపడుతున్నారని, రాబోయే ప్రభుత్వం జనసేన పార్టీ అని, ప్రజలందరూ కష్టాలకి అండగా జనసేన ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శిలు మొగిలి అప్పారావు, చీకట్ల శ్యామ్ కుమార్, మండల అధ్యక్షులు అమరాది వల్లి రామకృష్ణ, పట్టా శివ, మరియు పుణ్య మంతుల బాబురావు, గోపు సురేష్, వంకా కొండబాబు, ఎంపీటీసీ అభ్యర్థులు రాసాంశెట్టి కన్యక రావు, కేతినీడి గౌరీ నాగలక్ష్మి, జనసేన నాయకులు, యండ్రపు శ్రీనివాస్, మేళం బాబి, గున్నాబత్తుల రాంబాబు, సి.హెచ్ శిరీష, మానేపల్లి పద్మరాజు, కట్ట బంగార్రాజు, తోట ప్రసాద్, తోట సతీష్, నక్క శ్రీను, మోటూరి మహేష్, దాసం కొండబాబు, దేశిరెడ్డి సతీష్, నాగేశ్వరరావు, సిక్కోలు రాజశేఖర్, మెరుగు ఇజ్రాయిల్, మైనపల్లి రాజు, సురేంద్ర, కొనమంచిలి దుర్గాప్రసాద్, గరగ మూర్తి, వెంకటేష్, కంద సోమరాజు, పసుపులేటి దుర్గాప్రసాద్, మేడిశెట్టి కామేష్, బెజవాడ దొర, గల్లా అంజి, జనసైనికులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.